Coronavirus:తబ్లిగి సభ్యులపై కేసు నమోదు.. ఆ పనిచేసినందుకే..

కరోనా ఐసోలేషన్ వార్డులో అర్ధనగ్నంగా తిరగడంతో పాటు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కొంతమంది తబ్లిగీ జమాత్ సభ్యులపై కేసు నమోదు చేశారు.

news18-telugu
Updated: April 3, 2020, 1:11 PM IST
Coronavirus:తబ్లిగి సభ్యులపై కేసు నమోదు.. ఆ పనిచేసినందుకే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన కొంతమంది తబ్లిగి జమాత్ సభ్యులపై కేసు నమోదయ్యింది. కరోనా వైరస్ పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ సిబ్బందికి సహకరించకపోవడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించడం వంటి పలు ఆరోపణల కారణంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మత ప్రార్థనలకు హాజరైన కొంతమంది తబ్లిగి జమాత్ సభ్యులను కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి ఐసోలేషన్ వార్డులో జమాత్ సభ్యులు అర్ధనగ్నంగా తిరగడం, నర్సింగ్ సిబ్బందిని గేళి చేసేలా అసభ్యంగా పాటలు పడినట్టు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

అంతటితో ఆగకుండా సిగరెట్టు, పొగాకు కావాలని డిమాండ్ చేశారని ఆ ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌కు సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.ఈ తతంగాన్నంతా మెడికల్ అధికారి జిల్లా ఎస్పీతో పాటు మేజిస్ట్రేట్ దృష్టికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేశామని ఘజియాబాద్ ఎస్పీ కళానిధి నైతాని చెప్పారు. స్త్రీల పట్ల అసభ్య ప్రవర్తనతో పాటు అంటు వ్యాధులు వ్యాపించే విధంగా ప్రవర్తించి ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి నేరాలకు పాల్పడినందు వల్ల కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్పీ స్థాయి అధికారితో పాటు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ విచారణ చేపట్టారని తెలిపారు.
First published: April 3, 2020, 1:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading