గుడ్ న్యూస్: ఇక డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ మొబైల్‌లో చూపిస్తే చాలు

రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లాంటి పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో చూపించొచ్చు. అయితే స్కాన్ చేసిన కాపీలను మాత్రం అనుమతించరు.

news18-telugu
Updated: November 24, 2018, 11:43 AM IST
గుడ్ న్యూస్: ఇక డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ మొబైల్‌లో చూపిస్తే చాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాహనదారులకు శుభవార్త. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్లను డ్రైవింగ్ సమయంలో మీ వెంట తీసుకెళ్లక్కర్లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాటి కాపీలు చూపిస్తే చాలు. పేపర్‌లెస్ గవర్నెన్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఈ అవకాశం కల్పిస్తోంది. కేంద్ర మోటార్ వాహన చట్టం, 1989లో సవరణ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ లాంటి పత్రాలన్నింటినీ ఎలక్ట్రానిక్ రూపంలో చూపించొచ్చు. అయితే స్కాన్ చేసిన కాపీలను మాత్రం అనుమతించరు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'డిజీలాకర్' యాప్‌లో డాక్యుమెంట్స్ సేవ్ చేసుకొని చూపించాల్సి ఉంటుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లన్నీ 'డిజీలాకర్' యాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత అధికారులు జారీ చేసే డాక్యుమెంట్లను ఈ యాప్‌లో సులువుగా ధృవీకరించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

రూ.2 లక్షల్లోపు టాప్ 5 మోటార్ సైకిళ్లు ఇవే...షాపింగ్‌కు వెళ్తున్నారా? డబ్బు ఆదా చేసే 9 మార్గాలివే...

రెడ్‌మీ నోట్ 6 ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఒత్తిడి తగ్గించుకోవాలా? ఈ ఆహారం తినండి...పేటీఎం కొత్త స్కీమ్... బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ లాభం
First published: November 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు