కొవిడ్-19ను (Covid 19) సమర్థంగా ఎదుర్కొనే దిశగా భారత్ సాగుతోంది. వీలైనంత త్వరగా అందరికీ టీకాలు (Vaccine) వేయాలనే లక్ష్యంలో కీలకమైన అడుగు పడింది. బయోలాజికల్ ఇ.లిమిటెడ్ కంపెనీ తయారు చేసిన కార్బెవాక్స్ (Corbevax) వ్యాక్సిన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు బుధవారం నుంచి టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయం తీసుకొంది. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ప్రికాషన్ డోస్ ఇవ్వడంపై ఉన్న నిబంధనలను కూడా సడలించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ‘సురక్షితమైన పిల్లలతోనే సురక్షితమైన భారతదేశం సాధ్యం. మార్చి 16వ తేదీ నుంచి 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కొవిడ్ టీకాలు వేస్తామని తెలియజేడానికి సంతోషిస్తున్నాను.
వామ్మో... పెట్రో ధరలు భరించడం నావల్ల కాదు.. గుర్రం స్వారీయే నయం.. వైరల్ వీడియో
అదే విధంగా 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు ముందు జాగ్రత్త డోసులను పొందగలుగుతారు. పిల్లల కుటుంబాలు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులను మూడో డోస్ తీసుకోవాలని కోరుతున్నాను’ అని చెప్పారు.
కార్బెవాక్స్ వ్యాక్సిన్ వివరాలు..
టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ ఫర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ , టెక్సాస్, హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సహకారంతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ కంపెనీ కార్బెవాక్స్ టీకాను అభివృద్ధి చేసింది. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ ఇదే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పపిల్లలకు కార్బెవాక్స్ వ్యాక్సిన్ వేయాలని ఆదేశించింది. 2021 డిసెంబరు చివరిలో కార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది.
2022 ఫిబ్రవరిలో కార్బెవాక్స్‌ను 12 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వేసేందుకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్ అనుమతించింది. దీనికి సంబంధించి అత్యవసర వినియోగ అధికారాన్ని కంపెనీ (EUA-Emergency Use Authorisation) పొందింది. వ్యాక్సిన్‌పై ‘రీకాంబినెంట్ ప్రొటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్’ అని లేబుల్ ఉంటుంది. హెపటైటిస్ షాట్ తరహాలోనే కార్బెవాక్స్ ఉంటుంది. ఇది mRNA (ఫైజర్-బయోఎన్‌టెక్, మోడర్నా) పద్ధతిలో నాన్-రెప్లికేటింగ్ వైరల్ వెక్టర్ (కొవిషీల్డ్, స్పుత్నిక్) వంటి వాటికి భిన్నంగా తయారు చేశారు. అన్ని విధాలుగా వ్యాక్సిన్‌ను పరీక్షించారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజల రక్షణకు పెద్దస్థాయిలో సంస్థలు వ్యాక్సిన్ తయారీకి ముందుకుకొచ్చాయి. ప్రపంచాన్ని సంక్షోభం నుంచి రక్షించడానికి టీకా అభివృద్ధి చేయడమే మార్గం.
ఫేజ్-III హ్యూమన్ ట్రయల్స్‌లో.. కొవిషీల్డ్‌తో పోలిస్తే కార్బెవాక్స్ మెరుగైన ఫలితాలను కనబరచింది. యాన్సెస్ట్రల్-వుహాన్ రరకం, ప్రపంచ వ్యాప్తంగా వవిజృంభించిన డెల్టా వేరియంట్‌పై మెరుగ్గా కార్బెవాక్స్ పోరాడిందని బయోలాజికల్ ఇ చెప్పింది. యాన్సెస్ట్రల్-వుహాన్ రరకంపై వ్యాక్సిన్ 90 శాతానికిపైగా సమర్థంగా పని చేస్తోందని ,డెల్టా వేరియంట్ రోగలక్షణ ఇన్ఫెక్షన్లను నివారించడంలో 80 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని తేలింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో కార్బెవాక్స్ ప్రభావాన్ని అంచనా వేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. ఆఫీసులోమొబైల్ ఫోన్లు వాడొద్దన్న హైకోర్టు
రీకాంబినెంట్ ప్రొటీన్ ప్లాట్‌ఫారమ్‌ను కార్బెవాక్స్ ఉపయోగిస్తుంది. దీన్ని ప్రస్తుతం దేశంలో పంపిణీ చేస్తున్న ఏ ఇతర టీకాలోనూ వినియోగించడం లేదు. ఇతర వ్యాక్సిన్ల తరహాలోనే కార్బెవాక్స్, వైరస్ కణాల ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. వాటిని పోలిన సెల్స్‌ను తయారు చేయడం కాకుండా ల్యాబ్‌లో రూపొందించి అందించిన క్లోన్డ్ స్పైక్ ప్రోటీన్‌ను చిన్న పరిమాణంలో ఇంజెక్ట్ చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రొటీన్లను ముప్పుగా గుర్తిస్తుంది. తదనుగుణంగా ప్రతిస్పందనను అభివృద్ధి చేస్తుంది, చివరికి, లైవ్ వైరస్ కణాలకు సోకే తీవ్రమైన వ్యాధికి కారణమయ్యే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.
బయోలాజికల్ ఇ సంస్థ ఓ ప్రకటనలో.. ‘తక్కువ, మధ్య- ఆదాయ దేశాలకు కూడా వ్యాక్సిన్ సరిపోతుంది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే రెండు డోసులను భారతదేశంలో రూ. 400 కంటే తక్కువగా అందిస్తున్న సంస్థ బయోలాజికల్ ఇ. కొవిషీల్డ్ ఒక డోస్‌కు దాదాపు రూ. 300- రూ.400. అయితే రష్యన్ స్పుత్నిక్ వీ ధర దాదాపు రూ.1,000. కొవాగ్జిన్ రెండు డోస్‌లకు దాదాపు రూ. 1,400’ అని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona Vaccine