హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఘోరం.. రద్దీ రోడ్డు మీద ఢీ కొన్న మూడు ఆటో మూడు ఆటో రిక్షాలు, కారు.. వీడియో వైరల్..

ఘోరం.. రద్దీ రోడ్డు మీద ఢీ కొన్న మూడు ఆటో మూడు ఆటో రిక్షాలు, కారు.. వీడియో వైరల్..

ఢీకొన్న మూడు ఆటో రిక్షాలు

ఢీకొన్న మూడు ఆటో రిక్షాలు

Mumbai: రద్దీగా ఉన్న రోడ్డుపై ఘోరం సంభవించింది. ఒకదానికి మరోకటి మూడు ఆటో రిక్షాలు ఢీకొన్నాయి. దీంతో రోడ్డుమీద ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఘట్ కోపర్ లోని ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. రద్దీగా ఉన్న చౌరస్తా వద్ద కొందరు విద్యార్థులు ఆటోలలో, నడుచుకుంటు వెళ్లున్నారు. ఇంతలో ఆటోలు స్పీడ్ గా వచ్చి ఒకదానికి మరోకటి ఢీకొన్నాయి. దీంతో రోడ్డుపైన ఉన్న పిల్లలు, పెద్దలు కొందరు రోడు మీద పడిపోయారు. ఇక.. మరో కారు వేగంగా వచ్చింది. అది కింద పడిన వారిని ఢీకొట్టుకుంటూ (Road accident) ముందుకు వెళ్లిపోయింది.

దీంతో అక్కడి వారంతా భయంతో తలోదిక్కున పరుగులు పెట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి చెందిన ఘటన అక్కడి సీసీకెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (viral news)  మారింది.

ఇదిలా ఉండగా కేరళకు (Kerala) చెందిన ఒక నవవధువు తన పెళ్లి ఫోటో షూట్ కోసం గుంతలు పడిన రోడ్లను ఎంచుకుంది.

ఆమె అందంగా రెడీ అయ్యి.. గుంతలు పడిన రోడ్లగుండా నడుచుకుంటూ వస్తుంది. కాగా, ఆ ప్రాంతంలో రోడ్లన్ని వర్షం పడి పూర్తిగా గుంతలుగా మారిపోయాయి. కనీసం యువతి సరిగ్గా నడవలేక ఇబ్బందులు పడుతుంది. కనీసం ఈ రకంగా అయిన.. తాము ఎదుర్కొంటున్న బాధలు అధికారులు, నాయకులవరకు వెళ్తుందని నవవధువు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

దీనితో యువతి తన పెళ్లి ఫోటోషూట్ తో పాటు.. సమాజం పట్ల తన సామాజిక బాధ్యతను కూడా సోషల్ మీడియాలో అందరికి తెలిసేలా చేసింది. కనీసం దీన్ని చూసైన అధికారులు స్పందిస్తారేమోనని నవవధువు భావించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లుకొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వధువు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. మరికొందరు సమాజం పట్ల ఆమె చూపిన బాధ్యతను శెభాష్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Mumbai, Road accident, Viral Video

ఉత్తమ కథలు