హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కారు కొనే వారికి చెక్ లిస్ట్.. లోన్ కావాలా? మీకు ఉండాల్సిన అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ ఇవే

కారు కొనే వారికి చెక్ లిస్ట్.. లోన్ కావాలా? మీకు ఉండాల్సిన అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ ఇవే

Car Prices | కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, అందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకోండి. ముందే సిద్ధమైతే కారు లోన్ సులువు అవుతుంది.

Car Prices | కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, అందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకోండి. ముందే సిద్ధమైతే కారు లోన్ సులువు అవుతుంది.

Car Prices | కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే, అందుకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకోండి. ముందే సిద్ధమైతే కారు లోన్ సులువు అవుతుంది.

ఇంకా చదవండి ...

    భారతదేశంలోని వివిధ బ్యాంకులు , ఆర్థిక సంస్థలు కార్ లోన్లు (Car Loans from Banks) అందిస్తున్నాయి. కొత్త కార్లతో పాటు సెకండ్ హ్యాండ్ కార్ల (Second hand cars for sale) కొనుగోలుకు సైతం ఫైనాన్సింగ్ ఆప్షన్లను సంస్థలు అందుబాటులో ఉంచాయి. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్లు వీటిని ఎంచుకోవచ్చు. సరైన కార్ లోన్‌ను (How to choose best car loan) ఎంచుకోవడానికి నమ్మకమైన గైడ్‌ లేదా ఆర్థిక సలహాదారుల సూచనలు పాటించడం మంచిది. వారు మీ అవసరాలకు తగ్గట్లు లోన్ మొత్తం, ఇతర అంశాలను విశ్లేషించి సలహాలు ఇస్తారు. ఆ ప్రకారం లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు కస్టమర్లు కార్ లోన్ పొందేందుకు అర్హత ప్రమాణాలు (Eligibilities for Car Loan) , ఇందుకు అవసరమైన డాక్యుమెంట్ల  (Documents for Car Loan) గురించి సైతం తెలుసుకోవాలి.

    సాధారణంగా వివిధ బ్యాంకులు లోన్ల మంజూరుకు ప్రత్యేక నియమ, నిబంధనలు రూపొందించుకుంటాయి. ఈ అర్హత ప్రమాణాలకు లోబడి ఉన్నప్పుడే కార్ లోన్ ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దేశంలోని ప్రధాన బ్యాంకులు రూపొందించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా కార్ లోన్ పొందేందుకు కొన్ని అంశాలపై కస్టమర్లు దృష్టిపెట్టాలి.

    Maruti Suzuki: మారుతి కారు కొంటున్నారా..అయితే ఇకపై లోన్ మరింత సులభం...ఎలాగంటే..

    కార్ లోన్ అర్హత ప్రమాణాలు

    వివిధ బ్యాంకులకు కార్ లోన్ అర్హతలు భిన్నంగా ఉండవచ్చు. సాధారణ అర్హత ప్రమాణాలు ఇలా ఉంటాయి..

    వయసు

    దరఖాస్తుదారుల కనీస వయసు 18 సంవత్సరాలుగా ఉండాలి. గరిష్ట వయసు మాత్రం నెలవారీ జీతం పొందేవారికి 60 సంవత్సరాలు, స్వయం ఉపాధి అవకాశం ఉన్నవారికి 65 సంవత్సరాలుగా ఉండాలి. కొన్ని బ్యాంకుల్లో గరిష్ట వయసు 75 ఏళ్ల వరకు కూడా ఉంది.

    ఆదాయం

    దరఖాస్తుదారుల కనీస నెలవారీ ఆదాయం రూ.20 వేల నుంచి రూ.25 వేలుగా ఉండాలి. వార్షిక ఆదాయం రూ.3 లక్షలు ఉంటే లోన్ ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    Buy a new car: కొత్త కారు కొంటున్నారా... ఇలా కొంటే రూ.లక్షకు పైగా సేవ్ చేసుకునే చాన్స్..

    ఉపాధి రకం

    క్రమం తప్పకుండా జీతం పొందేవారితో పాటు స్వయం ఉపాధి ఉన్న ఖాతాదారులు కూడా కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే దరఖాస్తుదారులు ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండాలి. ప్రస్తుత యాజమాన్య సంస్థలో కనీసం 1 సంవత్సరం నుంచి ఉద్యోగం చేస్తుండాలి. లేదంటే స్వయం ఉపాధి మార్గాల నుంచి క్రమం తప్పకుండా ఆదాయం ఉండాలి.

    కారు మోడల్

    బ్యాంకులు ఆమోదించే వివిధ రకాల కారు మోడళ్లపై లోన్ పొందవచ్చు.

    నివాస స్థలం

    భారతదేశంలోని గ్రామీణ/సెమీ-అర్బన్/పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు లోన్‌కు అర్హులు. ప్రస్తుత ప్రాంతంలో కనీసం 1 సంవత్సరం నుంచి నివాసం ఉండేవారు కార్ లోన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    Electric Scooters in India: 2022లో మార్కెట్లో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే...

    కార్ లోన్ అర్హత కాలిక్యులేటర్

    ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్.. వంటి అన్ని ప్రధాన బ్యాంకులు ‘కార్ లోన్ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్’ (Car Loan Eligibility Calculator) సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీని ద్వారా కార్ లోన్ ఎలిజిబిలిటీ లేదా అర్హతను తనిఖీ చేసుకోవచ్చు. ఈ టూల్స్ సంబంధిత బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుదారులు తమ కాంటాక్ట్ నంబర్, నివాస స్థిరత్వం, ఉపాధి రకం, కారు మోడల్, కారు ఎక్స్-షోరూమ్ ధర వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసిన తర్వాత.. మీరు కారు లోన్‌కు అర్హులా కాదా అని ఈ టూల్ ఆన్‌లైన్ ద్వారా తనిఖీ చేస్తుంది. ఈ ఇన్‌పుట్ డేటా కూడా బ్యాంకులను బట్టి మారుతుంది. అందువల్ల కార్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు నిర్దిష్ట రుణదాతల అర్హతలు, డాక్యుమెంట్లను తనిఖీ చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

    కార్ లోన్ అర్హతను ప్రభావితం చేసే అంశాలు

    క్రెడిట్ స్కోర్: వ్యక్తుల రీపేమెంట్ కెపాసిటీ, ఇప్పటికే ఉన్న అప్పుల మీ రీపేమెంట్ బిహేవియర్‌ను బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ద్వారా అంచనా వేస్తాయి. క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. లోన్‌ను సకాలంలో తిరిగి చెల్లించగలరని బ్యాంకులు భావిస్తాయి.

    కారు రకం: ఫైనాన్సింగ్‌ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటున్న కారు రకం, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల ఆధారంగా ప్రతి కారు మోడల్‌కు నిర్దిష్ట రీసేల్ విలువ ఉంటుంది. మీరు కోరుకునే కారు రీసేల్ విలువ ఎక్కువగా ఉంటే, మీ కారు లోన్ అర్హత కూడా ఎక్కువగా ఉంటుంది.

    Mercedes-Benz EV: ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు...1000 కిలోమీటర్లు..నాన్ స్టాప్ గా వెళ్లొచ్చు...మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు...

    ఉపాధి: జీతం పొందే ఉద్యోగి కారు లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు.. వారికి కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి. ప్రస్తుత కంపెనీలో కనీసం ఒక ఏడాది నుంచి ఉద్యోగం చేస్తుండాలి. స్వయం ఉపాధి పొందేవారు కనీసం 2 నుంచి 3 సంవత్సరాల పాటు అదే వ్యాపారంలో ఉండాలి.

    యజమాన్య సంస్థ స్థాయి: కొన్నిసార్లు మీరు పని చేసే కంపెనీ సైతం మీ కారు లోన్ అర్హతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు.. ఫార్చ్యూన్ 100 కంపెనీ లేదా మంచి ర్యాంక్‌లో ఉన్న ఏదైనా ఇతర కంపెనీలో ఉద్యోగులకు లోన్ అర్హతను బ్యాంకులు ఎక్కువగా నిర్దేశిస్తాయి.

    రుణదాతతో సంబంధం: కస్టమర్లకు బ్యాంకు సత్సంబంధాలు ఉన్నప్పుడు.. తక్కువ రేటుకు అధిక రుణ మొత్తాన్ని ఆమోదించేలా బ్యాంకుతో చర్చలు జరపవచ్చు.

    Maruti Suzuki Baleno: కొత్త ఏడాది సరికొత్తగా మార్కెట్లోకి మారుతి సుజుకి బాలెనో 2022 ఎడిషన్.. ప్రత్యేకతలివే..

    లోన్ దరఖాస్తు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లు (Documents)

    కస్టమర్లు లోన్ పొందేందుకు అర్హతను నిరూపించడానికి కొన్ని రకాల పత్రాలను (డాక్యుమెంట్లను) బ్యాంకుల్లో అందించాలి. అయితే ఈ నిబంధనలు కూడా బ్యాంకులను బట్టి మారవచ్చు. దరఖాస్తుదారులు సమర్పించాల్సిన సాధారణ పత్రాల్లో ఏమేం ఉంటాయో తెలుసుకుందాం.

    గుర్తింపు పత్రాలు (Identity proof)

    కార్ లోన్‌కు దరఖాస్తు చేసే కస్టమర్లు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు లేదా పాన్ కార్డుల్లో దేన్నైనా ఒక గుర్తింపు పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

    చిరునామా (Address proof)

    దరఖాస్తుదారులు తమ చిరునామాను ధ్రువీకరించే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు లేదా యుటిలిటీ బిల్లుల్లో ఏదైనా ఒకదాని జిరాక్స్ కాపీని బ్యాంకులకు అందించాలి.

    Kia Carens: కియా కొత్త కార్ వచ్చేసింది... ఆంధ్రప్రదేశ్ నుంచి గ్లోబల్ మార్కెట్‌లోకి

    ఆదాయానికి రుజువు (Income Proof)

    కస్టమర్లు తమ ఆదాయానికి సంబంధించిన ధ్రువపత్రాలను సమర్పించినప్పుడే.. వారికి అందించాల్సిన లోన్ మొత్తంపై బ్యాంకులు ఒక నిర్ణయానికి వస్తాయి. ఇందుకు కస్టమర్లు ఫారం 16, జీతం తీసుకునే వారు అయితే శాలరీ స్లిప్పులు, తాజా ఆదాయపు పన్ను రిటర్న్స్ పత్రాలు, కనీసం 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను బ్యాంకుల్లో సమర్పించాల్సి ఉంటుంది.

    సాధారణంగా అన్ని సంస్థలు ఇలాంటి డాక్యుమెంట్లనే అడుగుతాయి. ఉపయోగించిన లేదా సెకండ్ హ్యాండ్ కార్ల విషయంలో కూడా బ్యాంకులు ఇలాంటి నిబంధనలే పాటిస్తాయి. అయితే కార్ లోన్‌ కోసం దరఖాస్తు చేసేవారు ముందుగా సంబంధిత బ్యాంకులు ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతున్నాయో తెలుసుకోవాలి. ఆయా సంస్థల్లో లోన్ పొందాలంటే, వారు అడిగే అన్ని పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

    First published:

    ఉత్తమ కథలు