ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీకొని బాలుడి మృతి

తిజారాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్.. నాగ్‌పూర్‌కు తిరుగు ప్రయాణం కాగా.. మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: September 12, 2019, 8:20 AM IST
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీకొని బాలుడి మృతి
మోహన్ భగవత్(File Photo)
  • Share this:
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తాత గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తున్న వీరిద్దరిని మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టింది.రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.తిజారాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్.. నాగ్‌పూర్‌కు తిరుగు ప్రయాణం కాగా.. మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది.జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన మోహన్ భగవత్‌ కాన్వాయ్‌లో మొత్తం 8 నుంచి 10 కార్ల వరకు ఉన్నట్టు సమాచారం. మృతి చెందిన బాలుడిని సచిన్‌గా గుర్తించామని స్థానిక ఎస్ఐ తెలిపారు.ప్రమాదానికి కారణమైన కారును ఇంకా సీజ్ చేయలేదన్నారు. అయితే వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు.
Published by: Srinivas Mittapalli
First published: September 12, 2019, 8:18 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading