బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?

Bin Laden Elephant : ఆ ఏనుగు ఐదుగురి ప్రాణాలు తీయడంతో అంతా దాన్ని బిన్ లాడెన్ ఏనుగు అని పిలిచారు. ఇప్పుడు అది చనిపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

news18-telugu
Updated: November 19, 2019, 6:31 AM IST
బిన్ లాడెన్ ఏనుగు మృతి... ఎవరు చంపారు?
చనిపోయిన ఏనుగు (File - credit - twitter)
  • Share this:
Bin Laden Elephant : అసోం... గోల్‌పారా జిల్లాను గడగడలాడించిన ఏనుగు బిన్ లాడెన్‌ను గత వారమే రాంగు జులీ అడవిలో... అధికారులు మత్తు మందు ఇచ్చి బంధించారు. ప్రపంచాన్ని బిన్ లాడెన్ భయపెట్టినట్టు... ఆ ఏనుగు అసోంలోని ఓ గ్రామాన్ని భయపెట్టి ఐదుగురు గ్రామస్తులను చంపేసింది. ఇప్పుడు ఆ ఏనుగు చనిపోవడంతో... ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏనుగుకు మత్తు మందు ఇచ్చి బంధించిన తర్వాత... దాన్ని దట్టమైన అడవిలో వదిలేయాలని అనుకున్నారు. కానీ... నిర్ణయం మార్చుకొని... ఓరంగ్ నేషనల్ పార్క్‌కి తీసుకెళ్లారు. అక్కడ దానికి కృష్ణ అనే పేరు పెట్టారు. వారం నుంచీ ఆ ఏనుగు పార్కులోనే ఉంటోంది. ఇప్పుడు అది చనిపోవడంతో... ఏం జరిగిందో తేల్చాలని అసోం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది.


పార్కులో బంధించినట్లుగా ఉండటం ఆ ఏనుగుకి నచ్చలేదనీ... పార్కుకి వచ్చినప్పటి నుంచీ అది ఆరోగ్యంగా, హుషారుగా కనిపించలేదని పార్క్ సిబ్బంది చెబుతున్నారు. బెంగతోనే అది చనిపోయి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అధికారులు సైతం... తాము ఏనుగుకి మత్తు మందు అధిక డోస్ ఇవ్వలేదని అంటున్నారు. నిపుణులైన షూటర్లు ట్రాంక్విలైజర్లతో రెండుసార్లు కాల్చగానే ఆ మగ ఏనుగుకి మత్తెక్కి పడిపోయిందని తెలిపారు.అక్టోబర్‌లో ఈ ఏనుగు అసోంలోని ఓ గ్రామంలోకి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించింది. అది చేసిన దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. 

Pics : అందాల తెలుగు భామ శ్రీదివ్యను చూసి తీరాల్సిందేఇవి కూడా చదవండి :

సియాచిన్‌లో మంచు తుఫాను... ఆరుగురు సైనికులు మృతి

గన్ ఫైరింగ్‌లో ముగ్గురు మృతి... నెటిజన్ల ఫైర్...

Health : కూరగాయలు పచ్చివి తింటే ప్రమాదమా... ఆయుర్వేదం ఏం చెబుతోంది?

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్? నెక్ట్స్ ఏమవుతుంది?

స్కూళ్లకు సెలవులు ఇవ్వండి... ప్రభుత్వానికి పేరెంట్స్ విజ్ఞప్తి
First published: November 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>