మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోశ్యారీ రాజీనామా చేయడంతో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఆ రాష్ట్ర కొత్త గవర్నర్ గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లోకెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. సెప్టెంబర్ 19,2022న తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్-పీఎల్సీని బీజేపీలో విలీనం చేశారు. పటియాలా నుంచి శాసనసభకు ఎన్నికైన ఆయన పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2002 నుంచి 2007 వరకు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతని తండ్రి పాటియాలా సంస్థానానికి చివరి మహారాజు. 1963 నుంచి 1966 వరకు భారత సైన్యంలో పనిచేశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అమృత్ సర్ స్థానం నుంచి గెలుపొందారు. 2021 సెప్టెంబర్ 18న పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ సింగ్ రాజీనామా చేశారు. సిద్ధుతో విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు.
కెప్టెన్ రూటే సపరేటు:
పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపివేయడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ 2021 నవంబరులో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు.పంజాబ్ లోక్ కాంగ్రెస్ -పీఎల్‌సీగా తన పార్టీకి పేరు పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తూ పెట్టుకున్నారు. అయితే తర్వాత ఏకంగా బీజేపీలో తన పార్టీని విలీనంచేశారు. నిజానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత నుంచి అమరీందర్ బీజేపీతో మంచి సంబంధాలే పెట్టుకున్నారు. గతేడాది పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదిపారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చారు కూడా. ఇది పంజాబ్‌లో ఆప్ పాగా వేయడానికి కారణమైంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో బీజేపీలో తన పార్టీని కలిపేశారు కెప్టెన్.
మహారాష్ట్రపై అమిత్‌షా స్పెషల్ ఫోకస్:
పొలిటికల్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్‌గా నిలుస్తోన్న మహారాష్ట్రలో ప్రస్తుతం సీఎంగా ఏక్‌నాథ్ షిండే ఉన్నారు. ఆయన బీజేపీ మద్దతుతోనే సీఎం అయ్యారు. శివసేనను రెండుగా చీల్చింది ఏక్‌నాథ్ షిండేనే..! షిండేకు అండదండలు అందించింది బీజేపీనే. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురువేసిన ఏక్‌నాథ్ బీజేపీ సపోర్టుతో సీఎంగా ఎన్నికయ్యారు. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్వకత్వం అమిత్‌షాదే అంటారు నిపుణులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ అభ్యర్థే సీఎంగా ఉండాలన్నది అమిత్‌షా ప్లాన్‌గా తెలుస్తోంది. దానికి ఎప్పటినుంచో ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పుడు అమరీందర్‌ను గవర్నర్‌గా ఎన్నిక చేస్తున్నట్లు ప్రచారం జరగుతోంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.