Home /News /national /

Punjab Politics: నేను పారిపోను.. అక్క‌డి నుంచే పోటీ చేస్తా : అమ‌రీంద‌ర్‌సింగ్‌

Punjab Politics: నేను పారిపోను.. అక్క‌డి నుంచే పోటీ చేస్తా : అమ‌రీంద‌ర్‌సింగ్‌

అమ‌రీంద‌ర్ సింగ్ (ఫైల్ ఫోటో)

అమ‌రీంద‌ర్ సింగ్ (ఫైల్ ఫోటో)

Punjab Politics: పంజాబ్‌లో 2022లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా కొత్త పార్టీ పెట్టిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నేను ఎవ‌రిక భ‌య‌ప‌డ‌న‌ని తాను పోటీ చేసే స్థానాన్ని ప్ర‌క‌టించారు.

ఇంకా చదవండి ...
    పంజాబ్‌ (Punjab)లో 2022లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా కొత్త పార్టీ పెట్టిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన కుటుంబ కంచుకోటగా భావించే పాటియాలా (Patiala) నుంచి 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆదివారం ప్రకటించారు. తాను పారిపోనని అక్క‌డి నుంచి పోటీ చేస్తాన‌ని సింగ్ చెప్పినట్లు స‌న్నిహితుల‌తో ఆయన వ్యాఖ్యానించిన‌ట్టు స‌మాచారం. అమ‌రీంద‌ర్ (Amarindar singh) సింగ్ పాటియాలా నుంచి నాలుగుసార్లు పోటీ చేశారు. ఆయ‌న భార్య ప్రణీత్ కౌర్ 2014లో ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ ఈ నెల ప్రారంభంలో సొంత రాజకీయ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను స్థాపించారు.

    అంతే కాకుండా రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తానని ప్రమాణం చేశారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో ఆయన చెప్పారు.

    UNICEF: భార‌త్ భేష్‌.. విద్యాప్రమాణాలు మెరుగుప‌డ్డాయి: యూనిసెఫ్‌


    రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూతో తీవ్రమైన అధికార పోరు కారణంగా సెప్టెంబరులో అమ‌రీంద‌ర్‌ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఆయ‌న రాజీనామా అనంత‌రం చరణ్జిత్ సింగ్ చన్నీని పంజాబ్ ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్నారు.

    మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు
    ప్ర‌ధాని మోదీ రైతు చ‌ట్టాల‌ను (Farm Laws) ఉప‌స‌హ‌రించుకోవ‌డంతో కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్- బీజేపీ పొత్తు పెట్టుకోనున్నాయ‌నే ఉహాగానాలు పెరిగాయి.

    అమ‌రీంద‌ర్‌సింగ్‌ రాజీనామా స‌మ‌యంలో పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ (navjoth singh siddu)పై విమర్శలు గుప్పించారు. పంజాబ్‌కు చెందిన పార్టీ ఎంపీలందరూ సిద్దూని వ్యతిరేకించినా పీసీసీ అధ్యక్షుడిగా మీరు నియమించారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

    Uttar pradesh Elections: ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వేడి.. పార్టీల ప‌రిస్థితి.. వ్యూహాలు


    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan PM Imran khan), పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ భజ్వాను సిద్ధూ బహిరంగంగా ఆలింగనం (hug) చేసుకున్నారని గుర్తుచేశారు.

    మీ చర్యలు తనను గాయపరిచినట్లు సోనియాగాంధీకి రాసిన ఆ లేఖలో అమరీందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజీవ్ గాంధీ (rajiv Gandhi)తో తనకు పాఠశాల రోజుల నుంచే 67 ఏళ్ల అనుబంధం (1954 నుంచి) ఉందని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) లను తన బిడ్డలతో సమానంగా ప్రేమిస్తున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bjp, Congress, Elections, Punjab

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు