స్వదేశీ ఉత్పత్తులనే వాడదామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు మొట్ట మొదట కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అంతేకాదు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేంద్ర సాయధ బలగాల (CAPF) క్యాంటిన్లలో స్వదేశీ ఉత్పత్తులనే విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1 నుంచే ఇది అమల్లోకి రానుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, ఎస్ఎస్బీ బలగాలన్నీ CAPF కిందకు వస్తాయి. ఈ నేపథ్యంలో సుమారు 10 లక్షల మంది సాయుధ బలగాల కుటుంబాలు ఇకపై స్వదేశీ ఉత్తత్తులనే వాడనున్నాయని అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులనే వాడితే రాబోయే ఐదేళ్లలో మనదేశం ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
मैं देश की जनता से भी अपील करता हूं कि आप देश में बने उत्पादों को अधिक से अधिक उपयोग में लायें व अन्य लोगों को भी इसके प्रति प्रोत्साहित करें। हर भारतीय अगर भारत में बने उत्पादों (स्वदेशी) का उपयोग करने का संकल्प ले तो पांच वर्षों में देश का लोकतंत्र आत्मनिर्भर बन सकता है।
భారతీయులంతా స్థానిక ఉత్పత్తులనే వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. స్థానిక వస్తువులను ఉపయోగించడం పట్ల గర్వ పడాలని.. వాటికి మద్దతు అందించే చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఖాదీ వస్తువులను కొనుగోలు చేస్తే స్థానిక చేనేతకారులకు ఉపాధి లభిస్తుందన్నారు ప్రధాని. 'స్థానికం'ను మన జీవన మంత్రగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్లోబల్ బ్రాండ్స్ అన్నీ ఒకప్పుడు లోకలే. ప్రజలు వాటిని ఆదరించడం వల్లే గ్లోబల్గా మారాయని మోదీ అన్నారు. స్థానిక ఉత్పత్తులను వాడడంతో పాటు వాటికి స్వరం అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.