CANT YOU AFFORD A DESKTOP TO ARGUE SC IRKED OVER DISRUPTIONS AS LAWYERS USE MOBILE PHONES FOR ONLINE HEARINGS GH VB
Supreme Court: మొబైల్ ఫోన్ల హీయరింగ్పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ప్రత్యామ్నాయంగా వాటిని వాడాలని సూచన..
సుప్రీంకోర్డు (Image Credit:PTI)
Supreme Court: కోవిడ్ కారణంగా న్యాయస్థానాల్లో విచారణ గత కొంత కాలంగా ఆన్లైన్లోనే సాగుతోంది. చాలా మంది లాయర్లు మొబైల్ ఫోన్ల ద్వారా తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ మొబైల్ ఫోన్ల వల్ల కలిగే ఇబ్బందులు సుప్రీంకోర్టును చికాకు పెట్టిస్తున్నాయి.
కోవిడ్(Covid 19) కారణంగా న్యాయస్థానాల్లో విచారణ గత కొంత కాలంగా ఆన్లైన్లోనే(Online) సాగుతోంది. చాలా మంది లాయర్లు మొబైల్(Mobile) ఫోన్ల ద్వారా తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ మొబైల్ ఫోన్ల వల్ల కలిగే ఇబ్బందులు సుప్రీంకోర్టును(Supreme Court) చికాకు పెట్టిస్తున్నాయి. మొబైల్ ఫోన్లతో ఇబ్బందుల కారణంగా సోమవారం(Monday) ఏకంగా లిస్ట్ చేసిన 10 కేసుల్లో వాదనలను సుప్రీంకోర్టు వాయిదా వేయాల్సి వచ్చింది. వర్చువల్ హియరింగ్స్ సందర్భంగా పదేపదే ఆటంకాలు కలుగుతుండటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
చాలా మంది న్యాయవాదులు మొబైల్ ఫోన్స్ ద్వారా వాదనలు వినిపిస్తున్నారని, ఇలాగే ఉంటే మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనేవారిని నిషేధించాల్సి ఉంటుందని మందలించింది. వీడియో కాన్ఫరెన్సింగ్(Video Conference) ద్వారా విచారణకు హాజరైనప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించవద్దని, డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. స్థిరమైన కనెక్షన్‌తో కూడిన ఇంటర్నెట్తో కోర్టు హియరింగ్ కోసం Cisco Webex అప్లికేషన్లో పాల్గొనాలని న్యాయవాదులకు కోర్టు విజ్ఞప్తి చేసింది. అంతే కాదు వీడియో కాన్ఫరెన్సింగ్ సవ్యంగా సాగేలా చూసేందుకు ఇతర అప్లికేషన్లు అన్నీ క్లోజ్ చేయాలని సూచించింది. ఆడియో సిస్టమ్, మైక్రోఫోన్‌తో కూడిన హెడ్ సెట్ ఉపయోగిస్తే ఇంకా ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది.
వర్చువల్ కోర్టు ప్రోసిడింగ్స్‌కు సంబంధించి ఉత్తమ విధానాలను సుప్రీంకోర్టు నోటిఫై చేసింది. వాదనల సందర్భంగా న్యాయవాదుల నుంచి ఆడియో(Audio) లేదా వీడియోపరంగా ఆటంకాలు తలెత్తడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(NV Ramana), జస్టిస్ ఎ.ఎస్.బొపన్న, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం పదికి పైగా కేసుల విచారణను వాయిదా వేసింది.
“మొబైల్ ఫోన్ల ద్వారా కోర్టు ముందుకు వస్తున్న లాయర్లు కనిపించడం లేదు. ఈ మొబైల్ వ్యవహారాన్ని మేము నిషేధించాల్సి ఉంటుంది. మీరు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. తరచు అపియర్ అవుతున్నారు. మీరు మీ వాదనలు వినిపించడానికి డెస్క్‌టాప్ ఉపయోగించే స్థోమత మీకు లేదా?’’ అని ఒక కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో కేసు విచారణ సందర్భంగా లాయర్ వైపు ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం న్యాయస్థానానికి చికాకు కలిగించింది.
‘ఇలా విచారణను వినే శక్తి మాకు లేదు. మీరు మాట్లాడేది మేము సరిగ్గా వినేలా ఏదైనా ఆలోచన చేయండి. ఇప్పటికీ ఇలాంటి కేసులు పది అయ్యాయి. మేము గొంతు చించుకుంటున్నాం’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. మహమ్మారి ప్రబలిన నాటి నుంచి అంటే మార్చి 2020 నుంచి అత్యున్నత న్యాయస్థానంలో కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగుతోంది. మధ్యలో పరిస్థితి కాస్త సడలినప్పుడు కోర్టు కూడా ఆంక్షలు సడలించింది. ఈ మధ్య కాలంలో కేసుల సంఖ్య బాగా పెరిగిన విషయాన్ని జనవరి 2న పరిగణనలోకి సుప్రీంకోర్టు జనవరి 7 నుంచి వర్చువల్ విధానంలో వాదనలు వింటోంది. జడ్జిలు తమ నివాసాల్లోని కార్యాలయం నుంచి వాదనలు వింటున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.