దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదువలేదు.. కానీ.. : కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సంతోష్ గంగ్వార్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ,బహుజన్ సమాజ్ అధినేత్రి మాయావతి ఆయన వ్యాఖ్యలను ఖండించారు.

news18-telugu
Updated: September 15, 2019, 4:40 PM IST
దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదువలేదు.. కానీ.. : కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ (File Photo)
  • Share this:
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అవుతోందన్న ప్రత్యర్థి పార్టీల విమర్శలపై కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్ స్పందించారు. దేశంలో ఉద్యోగాలకు కొదువ లేదని.. కానీ వాటిని అందిపుచ్చుకునే నైపుణ్యాలు, సామర్థ్యాలు యువతకు ఉండటం లేదని.. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశ యువతకు ఉండటం లేదని అన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు రంగాల్లో ఉద్యోగాల కోత మొదలవడం.. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో గంగ్వార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దేశంలో ఉద్యోగ అవకాశాలకు కొదువలేదు. కానీ రిక్రూట్‌మెంట్ కోసం నార్త్ ఇండియా కోసం వస్తున్నవారు.. అక్కడి యువతలో అందుకు తగ్గ విద్యార్హతలు ఉండటం లేదు.
సంతోష్ గంగ్వార్,కేంద్రమంత్రి


సంతోష్ గంగ్వార్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ,బహుజన్ సమాజ్ అధినేత్రి మాయావతి ఆయన వ్యాఖ్యలను ఖండించారు. ఐదేళ్ల పాలనలో బీజేపీ ఉద్యోగాల కల్పలనలో విఫలమైందన్నారు. ఆఖరికి ఆర్థిక మాంద్యం కారణంగా ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయన్నారు. ఉద్యోగాలు కల్పించలేక.. ఆ వైఫల్యాన్ని కవర్ చేసుకునేందుకు ఉత్తర భారతీయులను అవమానించడం సరికాదన్నారు.
First published: September 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading