Bihar Elections 2020: గేదెపై తిరుగుతూ ప్రచారం.. అభ్యర్థి పై కేసు..

త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు వింత ప్రచారాలకు దిగుతున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వాళ్లు పడరాని పాట్లు పడుతున్నారు.

news18
Updated: October 20, 2020, 7:07 AM IST
Bihar Elections 2020: గేదెపై  తిరుగుతూ ప్రచారం.. అభ్యర్థి పై కేసు..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 20, 2020, 7:07 AM IST
  • Share this:
బీహార్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఒక అభ్యర్థి మాత్రం అందరిలా కాకుండా తన ప్రచారాన్ని విచిత్రంగా చేద్దామని తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. సాధారణంగా ఎన్నికల ప్రచారం చేసే సమయంలో ఎవరైనా నడుచుకుంటూనో.. లేక కారు ఇతర వాహనాలలో వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ ఈ అభ్యర్థి మాత్రం ఏకంగా గేదె మీద ప్రచారానికి వచ్చాడు. గేదెను ముస్తాబు చేసి ప్రచారానికి తీసుకురావడమే గాదు.. దాని మీద ఊరంతా తిరిగి తనకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించాడు. ఆ అభ్యర్థి పేరు మహ్మద్ పర్వేజ్ మన్సూరి.. బీహార్ లోని గయ నుంచి రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ (ఆర్ యూ సీ) నుంచి పోటీ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..

గయకు చెందిన పర్వేజ్.. అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అందరిలా కాకుండా ఆయన గేదె మీద తిరుగుతూ ప్రచారం చేశాడు. నగరంలోని గాంధీ మైదానం నుంచి స్వరాజ్ పురి రోడ్డు దాగా గేదె మీద తిరుగుతూనే ప్రచారం చేశాడు. తీరా స్వరాజ్ పురి చేరుకోగానే అది గమనించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జంతు చట్టంతో పాటు కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనపై కేసు నమోదుచేశారు.

దీనిపై మన్సూరి మాట్లాడుతూ.. గయ చాలా చెత్త నగరమని, ఇక్కడ రోడ్లన్నీ పాడయ్యాయని, పారిశుధ్యం పనులు మచ్చుకైనా కనిపించడం లేదని ఆరోపించారు. తమ ప్రజల సమస్యలు ప్రపంచానికి తెలియజేసేందుకు తాను ఇలా చేశానని మన్సూరి చెప్పుకొచ్చాడు.

కాగా, ప్రచారం సమయంలో అభ్యర్థులందరూ కోవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రచారానికి కూడా ఎక్కువ మంది వెళ్లకూడదని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈసీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గానూ మన్సూరిపై కేసు నమోదయ్యింది. కాగా అతడు తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు.

మూడు దశల్లో నిర్వహించనున్న బీహార్ ఎన్నికలలో.. తొలి దశలో 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాలు, రెండో దశలో 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలు, మూడో దశలో 15 జిల్లాల్లో 78 నియోజవకర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. నవంబరు 10న ఫలితాలను ప్రకటిస్తారని ఈసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 7:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading