హోమ్ /వార్తలు /జాతీయం /

క్యాన్సర్ చికిత్స మందుల ధరలు 90 శాతం తగ్గింపు...వ్యాధిగ్రస్తులకు ఊరట...

క్యాన్సర్ చికిత్స మందుల ధరలు 90 శాతం తగ్గింపు...వ్యాధిగ్రస్తులకు ఊరట...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

క్యాన్సర్ వ్యాధిలో కీలకమైన కీమో థెరఫీ చికిత్సలో 9 రకాల డ్రగ్స్ ధరలు భారీగా పతనం కానున్నాయి. ఇందులో లంగ్ క్యాన్సర్ కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. తగ్గిన ధరల ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం వాడే 'పెమ్‌క్సెల్' 500 మిల్లీగ్రాముల ఔషధం రూ.22000 నుంచి రూ.2800 వరకూ తగ్గింది.

ఇంకా చదవండి ...

    క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు కేంద్రం ఊరటకలిగించింది. జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) క్యాన్సర్ చికిత్స మందులను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్యాన్సర్ వ్యాధిలో కీలకమైన కీమో థెరఫీ చికిత్సలో 9 రకాల డ్రగ్స్ ధరలు భారీగా పతనం కానున్నాయి. ఇందులో లంగ్ క్యాన్సర్ కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. తగ్గిన ధరల ప్రకారం ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం వాడే 'పెమ్‌క్సెల్' 500 మిల్లీగ్రాముల ఔషధం రూ.22000 నుంచి రూ.2800 వరకూ తగ్గింది. అలాగే ఇదే ఔషధానికి సంబంధించిన 100 మిల్లీగ్రాములు డోస్ ధర సైతం రూ.7700 నుంచి రూ. 800కు తగ్గింది. అలాగే మరో ఔషధం ఎపిక్లోర్ 10 ఎంజీ ఇంజెక్షన్ ధర రూ.561 నుంచి రూ. 276కు తగ్గింది. అలాగే ఇదే ఔషధం 50 ఎంజీ ఇంజెక్షన్ ధర సైతం రూ.2662 నుంచి రూ.960కు దిగింది. దీంతో పాటు ఎర్లో టినిబ్ 100 ఎంజీ టాబ్లెట్స్ ధర రూ.6600 నుంచి రూ.1840కు తగ్గింది. మరో బ్రాండ్ లానోలిమస్ బ్రాండ్ సైతం రూ.726 నుంచి రూ.406కు దిగివచ్చింది.


    ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అటు ఫార్మా కంపెనీలు కానీ, డ్రగ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం విశేషం. మరోవైపు క్యాన్సర్ వ్యాధి నివారణ ఔషధాల ధరలు భారీగా ఉన్న కారణంగా ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబాటు ఉన్న కుటుంబాలకు చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్న ప్రయాసగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం గతంలోనే ధరలపై రివ్యూ చేయాలని ఎన్‌పీపీఏను ఆదేశిచింది. ఇదిలా ఉంటే గత మార్చిలోనే యాంటి క్యాన్సర్ ఔషధాల ధరలను తగ్గించగా, ప్రస్తుతం మరింత భారీగా తగ్గించడం గమనార్హం.

    First published:

    Tags: Cancer, Health, Medical treatment, World Cancer Day

    ఉత్తమ కథలు