హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian States : భారత్ లోని ఆ రాష్ట్రాల్లో పర్యటించొద్దు..కెనడా పౌరులకు ఆ దేశం హెచ్చరిక

Indian States : భారత్ లోని ఆ రాష్ట్రాల్లో పర్యటించొద్దు..కెనడా పౌరులకు ఆ దేశం హెచ్చరిక

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో

Canada Travel Advisory : భారత్ పర్యటనలో ఉన్న కెనడా(Canada) పౌరులకు ఆ దేశం కీలక సూచనలు చేసింది. భద్రతాపరమైన కారణాల వల్ల భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో అసలు పర్యటించొద్దని భారత్‌లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం కెనడా తాజాగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Canada Travel Advisory : భారత్ పర్యటనలో ఉన్న కెనడా(Canada) పౌరులకు ఆ దేశం కీలక సూచనలు చేసింది. భద్రతాపరమైన కారణాల వల్ల భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో అసలు పర్యటించొద్దని భారత్‌లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం కెనడా తాజాగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. కెనడా ప్రభుత్వం ఈ నెల 27న ట్రావెల్ అడ్వైజరీని అప్‌డేట్ చేసింది ఇందులోని వివరాల ప్రకారం భద్రతాకారణాల వల్ల పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకునే.. భారత్‌లోని గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దని సూచించింది.

మందుపాతరలు పేలే ప్రమాదం ఉన్న కారణంగా గుజరాత్ , పంజాబ్ , రాజస్థాన్‌లల్లో పాకిస్తాన్ సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉన్న ప్రాంతాలకు వెళ్లడాన్ని మానుకోవాలని కెనడా తన దేశ పౌరులకు స్పష్టం చేసింది. ఆయా ప్రాంతాలకు వెళ్లాలని ముందే ప్రణాళిక వేసుకుని ఉంటే దాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కెనడా తన ట్రావెల్ అడ్వైజరీలో సూచించింది. ఉగ్రవాదం ప్రమాదం కారణంగా అసోం , మణిపూర్‌లకు అనవసరమైన ప్రయాణాలను నివారించాలని తమ పౌరులకు సూచించింది. అత్యవసరం అయితేనే అసోం, మణిపూర్‌ రాష్ట్రాల్లో పర్యటించాలని సూచించింది. చైనాతో సరిహద్దులను పంచుకుంటోన్న ప్రాంతాల పేర్లను,కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ పేరుని ఇందులో నుంచి మినహాయించింది కెనడా ప్రభుత్వం. లఢక్‌ను మినహాయించినట్లు తెలిపింది.దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది.

Photos : కోట్ల రూపాయల ఆస్తులు వదిలి..సన్యాసిగా మారుతున్న 16 ఏళ్ల బాలుడు

కాగా,సెప్టెంబరు 23న భారత ప్రభుత్వం..కెనడాలో నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆ దేశంలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులను హెచ్చరించింది. అంతేకాకుండా ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని కూడా కెనడా ప్రభుత్వాన్ని కూడా కోరింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Canada, India pakistan border

ఉత్తమ కథలు