Home /News /national /

CAN BREAK LAWS FOR POOR WELFARE SAYS NITIN GADKARI THE UNION MINISTER SAID BUREAUCRATS ONLY HAVE TO SAY YES MKS

Nitin Gadkari : సంక్షేమ పథకాలపై గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. అధికారులపైనా అనూహ్య కామెంట్లు..

నితిన్ గడ్కరీ

నితిన్ గడ్కరీ

విచ్చలవిడి పథకాల వల్ల రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైనంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గడ్కరీ పూర్తి విరుద్ద వ్యాఖ్యలు చేశారు. బ్యూరోక్రాట్లపైనా గడ్కరీ సంచలన కామెంట్లు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi | Nagapur | Andhra Pradesh
పేదలకు ఉచిత సంక్షేమ పథకాలపై సర్వత్రా చర్చ జరుగుతోన్న తరుణంలో ప్రధాని మోదీ సహచర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల కట్టడి దిశగా బీజేపీ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం, విచ్చలవిడి పథకాల వల్ల రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైనంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గడ్కరీ పూర్తి విరుద్ద వ్యాఖ్యలు చేశారు. బ్యూరోక్రాట్లపైనా గడ్కరీ సంచలన కామెంట్లు చేశారు.

పేదల సంక్షేమానికి ఏ చట్టమూ అడ్డురాదని, అలాంటి చట్టాన్ని పదిసార్లు ఉల్లంఘించేందుకైనా వెనుకాడాల్సిన అవసరం లేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన ఈ మాటలే తారక మంత్రమని ఆయన పేర్కొన్నారు. నాగ్‌పుర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. మంత్రుల నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం పని చేస్తుందని, ఇందుకు అనుగుణంగా నిర్ణయాలను అమలు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

Gorantla Madhav Video : న్యూడ్ కాల్ ఉదంతం : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆంధ్రజ్యోతి ఆర్కే దావా..


‘‘మీరు చెప్పే దాని ప్రకారం ప్రభుత్వం పని చేయదని నేను ఎప్పుడూ అధికారులకు చెబుతాను. మీరు ‘ఎస్‌ సర్‌’ అని మాత్రమే చెప్పాలి. మేము (మంత్రులు) చెప్పినట్టుగా వాటిని మీరు అమలు చేయాలి. మా నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం పని చేస్తుంది’’ ఆయన అన్నారు. 1995లో పోషకాహార లోపం కారణంగా గడ్చిరోలి, మెల్ఘాట్‌లో వేలాది మంది గిరిజన పిల్లలు మరణించారని, ఆ గ్రామాలకు రోడ్లు లేవని, రోడ్ల అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డుగా వచ్చాయని ఆయన ఉదహరించారు.



ఉచిత పథకాల ఎత్తివేతకు బీజేపీ ఉద్దేశపూర్వక ప్రచారాన్ని ముమ్మరం చేసిందని, కార్పోరేట్ దొంగలకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మోదీ సర్కార్.. పేదల విషయంలో క్రూరంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల నిప్పులు చెరిగారు. సంక్షేమ ఉచిత పథకాలపై బీజేపీ ప్రచార తీరును తెలంగాణ సీఎం కేసీఆర్ సహా విపక్షాలకు చెందిన పలువురు నేతలు తీవ్రంగా తప్పుపడుతుండటం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ సహచర మంత్రి గడ్కరీ పేదల సంక్షేమానికి అవసరమైతే చట్టాన్ని ఉల్లంఘిస్తామనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Nitin Gadkari

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు