97 లోక్ సభ స్థానాలకు ఎల్లుండి పోలింగ్... ముగిసిన రెండో దశ ఎన్నికల ప్రచారం
రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సహా మొత్తం 97 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
news18-telugu
Updated: April 16, 2019, 6:09 PM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: April 16, 2019, 6:09 PM IST
రెండో దశ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎల్లుండి రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం సహా మొత్తం 97 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాల వారీగా చూసుకుంటే అసోం-5, బీహార్-5, ఛత్తీస్ గడ్-3, జమ్మూ కాశ్మీర్-2, కర్ణాటక-14, మహారాష్ట్ర-10, మణిపూర్-1, ఒడిశా-5, పుదుచ్చేరి-1, తమిళనాడు-39, త్రిపుర-1, ఉత్తరప్రదేశ్-8, పశ్చిమ బెంగాల్ -3 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1583 మంది ఎన్నికల బరిలో నిలిచారు.
రెండో దశలో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. రెండో దశ ఎన్నికల్లో పలువురు ప్రముఖుల భవితవ్యం తేలనుంది. కర్ణాటక నుంచి జేడీఎస్ అధ్యక్షడు దేవేగౌడతో ఆయన మనవడు నిఖిల్ గౌడ, సుమలత, ప్రకాశ్ రాజ్, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, ఉత్తరప్రదేశ్ నుంచి హేమామాలిని, తమిళనాడు నుంచి కనిమొళి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా బరిలో ఉన్నారు.

ఓటు ఎవరికి వేసారో..వారినే అడగండి : కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి
అంబరీశ్ పై అభిమానంతో ఆయన కొడుకు తొలి సినిమా టిక్కెట్‌ను లక్షల్లో కొనుగోలు చేసిన అభిమాని..
పార్లమెంటులో ఖర్గే అడుగుపెట్టలేరన్న మోదీ.. నిజం చేసి చూపిన బీజేపీ..
'తాతకు ప్రేమతో'...దేవెగౌడ కోసం ఎంపీ సీటుకు ప్రజ్వల్ రాజీనామా?
Lok Sabha Election 2019 Result: 52 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన సుమలత.. ‘మాండ్యా’లో అనూహ్య విజయం..
మాజీ ప్రధాని దేవెగౌడకు బిగ్ షాక్...తాత ఓడి మనవడు గెలిచాడు..
Loading...