CALL IT OUT NETWORK18 AND TRUECALLER TO HOST EVENT ON WOMEN ONLINE SAFETY ON MARCH 29 MKS GH
Call It Out: మహిళల ఆన్లైన్ భద్రతపై మార్చి 29న కాంక్లేవ్ -నెట్వర్క్ 18, ట్రూకాలర్ ఆధ్వర్యంలో..
మహిళల ఆన్ లైన్ భద్రతపై సదస్సు
డిజిటల్ ప్రపంచంలో(Digital World) ఆన్‌లైన్‌ను మహిళలకు సురక్షితమైన ప్రాంతంగా మార్చాలని, ఆన్లైన్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని భావిస్తూ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగం కానున్నారు.
డిజిటల్ ప్రపంచంలో(Digital World) ఆన్‌లైన్‌ను మహిళలకు సురక్షితమైన ప్రాంతంగా మార్చాలని, ఆన్లైన్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని భావిస్తూ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగం కానున్నారు. మహిళలలకు ఎదురవుతున్న వేధింపులపై అవగాహన కల్పించేందుకు మహిళా దినోత్సవం సందర్భంగా ItsNotOk పేరిట అవగాహన కార్యక్రమాన్ని Network18, Truecaller సంస్థలు నిర్వహిస్తున్నాయి. మార్చి 29వ తేదీన న్యూఢిల్లీలో ‘ది కాల్ ఇట్ అవుట్ కాంక్లేవ్’ పేరుతో ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
న్యూ ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఈఈ ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ఆన్లైన్ భద్రత(Online Safety), ఆన్లైన్ సెక్యూరిటీపై(Online Security) సదస్సులో చర్చిస్తారు. మహిళలకు ఆన్‌లైన్‌ను సురక్షితమైన ప్రాంతంగా మార్చేందుకు, తమకు ఎదురవుతున్న వేధింపులపై ఫిర్యాదులు చేయగలిగేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అతిథులు, వక్తలు మాట్లాడుతారు.
మహిళల ఆన్ లైన్ భద్రతపై నిర్వహించే ఈ కంక్లావ్ కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ షాలినీ సింగ్, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి దేవుసిన్ చౌహాన్ ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా కూడా ప్రత్యేక ప్రసంగం చేస్తున్నట్లు సమాచారం.
సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం, ఆన్లైన్ చిట్కాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, సైబర్ చట్టాల గురించి (మహిళలకు ఎదురవుతున్న వేధింపులు), మహిళల భద్రత, వేధింపులపై రిపోర్ట్ చేయడం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన మార్గదర్శకాలపై వక్తలు మాట్లాడుతారు.
CNBC-TV18 మేనేజింగ్ ఎడిటర్ షెరీన్ భాన్, ట్రూకాలర్ సహ-వ్యవస్థాపకుడు అండ్ సీఈవో అలాన్ మామెడి కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ తరహా కార్యక్రమం చేపట్టడానికి దారితీసిన చర్యలు, సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వారిని ఈ కార్యక్రమంలో భాగం చేయడంపై మాట్లాడుతారు. మహిళలు తమ సమస్యలను ఎలాంటి ఆందోళన లేకుండా చెప్పగలిగే సురక్షితమైన వాతావరణాన్ని నిర్మించడంపై స్వీడన్ రాయబారి క్లాస్ మోలిన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత కథనాలు , లలెసన్స్పై ట్రూకాలర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అన్నీకా పౌటియానెన్ మాట్లాడుతారు.
'ది కాల్ ఇట్ అవుట్ కాన్క్లేవ్' ఈవెంట్లో భాగమైన ఇతర ప్రముఖులలో రాజకీయ కార్యకర్త, ఎమ్మెల్యే, అతిషి, డిజైనర్, రాజకీయవేత్త షైన ఎన్సీ, సోషల్ యాక్టివిస్ట్ అండ్ డైరక్టర్, సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, డా.రంజనా కుమారి, లాయర్ పునీత్ భాసిన్, డీజీపీ(IFSO), ఢిల్లీ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు , డైరక్టర్ ఒసామా మంజెర్ ఉన్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.