HOME »NEWS »NATIONAL »calcutta high court key verdict only widow of a dead man has the right to his sperm sk

భర్త వీర్యం కోసం మామతో కోడలి కొట్లాట.. హైకోర్టు సంచలన తీర్పు

భర్త వీర్యం కోసం మామతో కోడలి కొట్లాట.. హైకోర్టు సంచలన తీర్పు
ప్రతీకాత్మక చిత్రం

మరణానికి ముందు వివాహ బంధంలో ఉన్నందున అతడి వీర్యంపై భార్యకే సర్వహక్కులు ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంకెవరికీ ఆ వీర్యం చెందదని స్పష్టం చేసింది.

  • Share this:
    ఓ వ్యక్తి మరణించాడు. చనిపోయే ముందు తన వీర్యాన్ని ఓ ఆస్పత్రిలోని స్పెర్మ్ బ్యాంక్‌లో భద్రపరిచాడు. ఐతే ఆ వీర్యం కోసం మృతుడి తండ్రి, భార్య కొట్లాడుతున్నారు. అంటే మామ, కోడలి మధ్య ఫైట్ జరుగుతోందన్న మాట. చివరికి వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అరుదైన ఈ కేసుసై కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. చనిపోయిన భర్త వీర్యంపై కేవలం అతడి భార్యకు మాత్రమే హక్కు ఉంటుదని స్పష్టం చేసింది. తల్లితండ్రులుతో పాటు సొంత పిల్లలకు కూడా ఎలాంటి హక్కులు ఉండవని తేల్చి చెప్పింది.

    తలసేమియాతో బాధపడుతున్న ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం కన్నుమూశాడు. ఐతే మరణానికి ముందు తన వీర్యాన్ని ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ ఆస్పత్రిలో భద్రపరిచాడు. కొడుకు మరణం తర్వాత 2019లో అతడి తండ్రి ఆ ఆస్పత్రికి వెళ్లాడు. తన కుమారుడి వీర్యం ఇవ్వాల్సిందిగా కోరాడు. ఐతే మీ కుమారుడికి ఇప్పటికే పెళ్లి అయినందున అతడి భార్య అంగీకారం కావాలని.. ఆమె అనుమతి ఉంటేనే ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. చేసేదం లేక అతడు కోడలి వద్దకు వెళ్లి అడిగాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. మామతో గొడవ జరగడంతో.. ఆమె దూరంగా ఉంది. అతడు చివరి ప్రయత్నంగా కోర్టుకు ఆశ్రయించాడు. మీరే న్యాయం చేయాలని.. నా కొడుకు వీర్యాన్ని నాకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.



    మృతుడి తండ్రి పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు విచారణ జరిపింది. కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత అతడి పిటిషన్‌ను తిరస్కరించింది. మరణానికి ముందు వివాహ బంధంలో ఉన్నందున అతడి వీర్యంపై భార్యకే సర్వహక్కులు ఉంటాయని హైకోర్టు తీర్పు చెప్పింది. ఇంకెవరికీ ఆ వీర్యం చెందదని స్పష్టం చేసింది. ఆస్పత్రి స్పెర్మ్ బ్యాంక్‌లో ఉన్న వీర్యం బాటిల్‌ను కేవలం భార్యకు మాత్రమే ఇవ్వాలని.. ఇంకెవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదని సదరు ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. కాగా, భర్త చనిపోయినప్పటికీ పిల్లలు కనాలని భావించిన వారు.. ఇలా ముందు జాగ్రత్తగా వీర్యాన్ని భద్రపరుస్తుటారు. ప్రత్యేక జాగ్రత్తలతో స్పెర్మ్ బ్యాంకుల్లో వీటిని నిల్వచేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:January 23, 2021, 10:20 IST