హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!

Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!

హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!

హర్ ఘర్ తిరంగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవానికి ఇదే నినాదం..!

ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్ గౌబా హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ప్రచారానికి సంబంధించి మొత్తం ప్రభుత్వం కదలి రావాలన్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Tirupati | Vijayawada | Visakhapatnam

ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చి 75 ఏళ్లు నిండుతుంది. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడానికి ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వారం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్ గౌబా హర్ ఘర్ తిరంగా (Har Ghar Tiranga) ప్రచారానికి సంబంధించి మొత్తం ప్రభుత్వం కదలి రావాలన్నారు. గడపగడపకు జెండా ఎగురవేసే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ (Jan Bhagidari) చురుకుగా పాల్గొని ప్రజాకేంద్రీకృత ఉద్యమంగా మార్చాలని అన్ని మంత్రిత్వ శాఖలను కోరారు. ఈ ప్రచారంపై జులై 18న కేబినెట్‌ సెక్రటరీ కమిటీ ఆఫ్ సెక్రటరీల (CoS) ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆదేశాలు జారీ చేశారు. కార్యదర్శులందరూ ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తూ తమవంతుగా సపోర్ట్ చేయాలని అభ్యర్థించారు.

కేబినెట్‌ సెక్రటేరియట్ నుంచి సెక్రటరీలందరికీ అందిన తాజా నోటిఫికేషన్‌లో... "అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు పూర్తి ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలి. హర్ ఘర్ తిరంగా లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయాలి. మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రత్యేక ఔట్రీచ్ ఉపయోగించుకుని, ఇన్‌స్టిట్యూషనల్ యంత్రాంగాన్ని వాడుకుంటూ రాష్ట్రాలలో వాటి పరిధిని పూర్తిగా పెంచి, ప్రజల ఉద్యమంగా మార్చడానికి కృషి చేయాలి" అని పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖలు, విభాగాలన్నీ కలిసి తమ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSEs), సంబంధిత పరిశ్రమల సంఘాలను, కార్పొరేట్ రంగాన్ని జెండాల సేకరణ, పంపిణీలో సహాయం చేయడానికి ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వం ఇటీవల హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)గా కూడా చేర్చింది.

ఇదీ చదవండి: సంస్కరణలతోనే స్వేచ్ఛకు అవకాశం: ప్రధాని మోదీ


కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు అత్యంత ప్రాధాన్యతతో సమావేశాలు నిర్వహించి తమ సంబంధిత కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయాలని, జాతీయ జెండాలు కొనుగోలు చేయడానికి ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్ ద్వారా నేరుగా జెండాల కోసం తమ ఆర్డర్‌ను ఇవ్వమని మంత్రిత్వ శాఖలు, విభాగాలను కూడా కోరారు. ఈ మేరకు తగినంత సంఖ్యలో జెండాల సరఫరాదారులు అక్కడ ఆన్-బోర్డ్‌లో ఉంచారు.

గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ పోర్టల్‌లో 16 సరఫరాదారులను లిస్ట్‌ చేసింది. వీరి దగ్గర ఇప్పటివరకు దాదాపు నాలుగు కోట్ల జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయి. వీరి నుంచి మంత్రిత్వ శాఖలు జెండాలను కొనుగోలు చేయవచ్చు. సరఫరాదారులు తమ టార్గెట్స్ రీచ్ అయ్యేందుకు తగినంత సమయం ఇవ్వాలని, ఈ జెండాల డెలివరీని మరింత వేగవంతం చేసేందుకు GEM పోర్టల్ ద్వారా ఫ్లాగ్‌ల కోసం డిమాండ్‌లను ముందుగానే ఉంచాలని మంత్రిత్వ శాఖలను కోరింది. ఆగస్టు 13 నుంచి 15 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అధికారుల ఇళ్లతో పాటు, దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు కూడా ప్రచార సమయంలో జాతీయ జెండాను ఎగురవేస్తాయి.

Published by:Mahesh
First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, Bjp, Central Government, Independence Day, Narendra modi

ఉత్తమ కథలు