ఇంట్లో ముసలివాళ్లను పట్టించుకోవట్లేదా... ఐతే జైలు శిక్షే...

India : ఇండియా ఆలోచనలు ఉన్నతంగా మారుతున్నాయి అని చెప్పేందుకు అప్పుడప్పుడూ కొన్ని సందర్భాలొస్తుంటాయి. ఇది అలాంటిదే. ఏంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 6, 2019, 6:37 AM IST
ఇంట్లో ముసలివాళ్లను పట్టించుకోవట్లేదా... ఐతే జైలు శిక్షే...
ఇంట్లో ముసలివాళ్లను పట్టించుకోవట్లేదా... ఐతే జైలు శిక్షే...
  • Share this:
Delhi : ప్రపంచ దేశాల్లో లాగే... మన దేశంలోనూ ముసలివాళ్లను పట్టించుకునే వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. తల్లిదండ్రులను ఆ వయసులో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు... వాళ్ల నుంచీ ఆస్తులు లాగేసుకొని... వాళ్లను రోడ్డుపాలు చేస్తున్నారు. లేదంటే ఇంట్లోనే ఉంచుకొని వాళ్లతో అడ్డమైన చాకిరీలూ చేయించుకుంటూ... వాళ్లను పనిమనుషుల్లా చూస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం ఇది. అళ్లుళ్లు, కోడళ్లదీ ఇదే తీరు. పెద్దవాళ్లను గౌరవించకుండా, వాళ్ల బాగోగులు చూసుకోకుండా... నాటకాలాడుతున్నారు. ఇకపై అలాంటివాళ్లందరికీ జైల్లో చిప్పకూడు తప్పదు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఇకపై పెద్దవాళ్లను, ముసలివాళ్లను నిర్లక్ష్యం చేసినా, వాళ్లను పోషించకుండా తప్పించుకుంటున్నా, వాళ్ల సంరక్షణ బాధ్యతల్ని గాలికొదిలేసినా... అది నేరమే అవుతుంది. ఫలితంగా తక్కువలో తక్కువ రూ.5000 ఫైన్ పడుతుంది. లేదంటే 3 నెలల జైలు శిక్ష తప్పదు. ఒకసారి ఫైన్ చెల్లించాక మళ్లీ ఇలాంటి నాటకాలే ఆడితే... మళ్లీ కఠిన చర్యలు తప్పవు. ఐతే... ఇదివరకు ముసలివాళ్లకు మెయింటెనెన్స్ కింద నెలకు రూ.10000 ఇవ్వాలనే రూల్ ఉండేది. ఇప్పుడు అది తొలగించి, పిల్లలు ఎంత సంపాదిస్తే... అందులోంచీ పెద్దవాళ్లకు కొంత మొత్తం పోషణ కోసం ఇవ్వాలని డిసైడ్ చేశారు. మెయింటెనెన్స్ అంటే... పెద్దోళ్లకు ఆహారం, బట్టలు, ఇంటి సౌకర్యం, ఆరోగ్యం వంటివి కల్పించాలి. ఇకపై పెద్దవాళ్లను చీదరించుకుంటూ, అనాథాశ్రమాల్లో వదిలేస్తే కుదరదు. కేంద్రం తెస్తున్న సవరణల బిల్లు చాలా బాధ్యతల్ని పిల్లలపై పెట్టింది. ఇండియా లాంటి దేశంలో ఇలాంటి చట్టాలు అమలవుతున్నది తక్కువే. కానీ... కేంద్రం దీనిపై చాలా సీరియస్‌గా ఉందని తెలిసింది. కచ్చితంగా అమలు చెయ్యాలనీ, పెద్దోళ్లను పట్టించుకోని వాళ్లను వదిలే ప్రసక్తే ఉండకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అందువల్ల పెద్దోళ్లు తమకు అన్యాయం జరుగుతోందని అనిపిస్తే... కోర్టుకు వెళ్లి న్యాయం పొందడమే కాదు... పిల్లల్ని, అల్లుళ్లు, కోడళ్లను కూడా దారికి తెచ్చుకోగలరు.


కోలీవుడ్‌లో దూసుకొస్తున్న స్వాతిష్టా క్రిష్ణన్
ఇవి కూడా చదవండి :

పాముకాటుతో మహిళ మృతి కేసులో కొత్త ట్విస్ట్... పోలీసులకే షాక్...

సోషల్ మీడియాపై స్కాన్... వివాదాస్పద పోస్టులు పెడితే... దబిడ దిబిడే...

Health : జామ ఆకులతో 8 ఆరోగ్య ప్రయోజనాలుHealth Tips : రోజూ ఇవి తినండి... బరువు తగ్గడం గ్యారెంటీ

యాపిల్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయాలు... చకచకా...
Published by: Krishna Kumar N
First published: December 6, 2019, 6:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading