Home /News /national /

PMGKAY: 80 కోట్ల మంది పేదలకు ప్రయోజనం.. గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం పొడిగింపు.. ఎప్పటివరకంటే..

PMGKAY: 80 కోట్ల మంది పేదలకు ప్రయోజనం.. గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పథకం పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూర్చేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన పథకాన్ని (PMGKAY) పొడిగించింది.

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది చేకూర్చేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ అన్న యోజన పథకాన్ని (PMGKAY) పొడిగించింది. మరో ఐదు నెలలు PMGKAY పథకాన్ని పొడిగించాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద సుమారు 81.35 కోట్ల మంది నిరుపేదలకు ఉచితంగా రేషన్‌ అందించనున్నారు. ఈ పథకం ద్వారా పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది.. కరోనా లాక్‌డౌన్ వేళ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. పేదలకు ఆహార భద్రత కల్పిస్తామని చెప్పింది. ఈ స్కీమ్ ద్వారా... ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి దేశంలోని పేదవారికి నెలవారీ ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మూడు విడతలుగా ఈ పథకం అమలైంది.

    అయితే ఈ ఏడాది మరోసారి దేశంలో కరోనా విజృంభించిన నేపథ్యంలో మే, జూన్ నెలలకు PMGKAY పథకాన్ని మరోసారి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ గరీబ్‌ కల్యాణ్‌ యోజనను ఈ ఏడాది దీపావళి వరకు మరో ఐదు నెలలపాటు పొడించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఆ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    ‘PMGKAY (Phase IV) కింద మరో ఐదు నెలలపాటు(జూలై నుంచి నవంబరు) అదనపు ఆహారధాన్యాలను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది’అని కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే రేషన్‌ దుకాణాల ద్వారా ఒక్కొక్కరికి కిలో రూ. 1-3 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్న ఆహారధాన్యాలకు ఇది అదనమని ఆ ప్రకటనలో పేర్కొంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Coronavirus, Covid-19, Free Ration, Pm garib kalyan yojana, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు