Bonus to Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్, దసరాకి ముందే అకౌంట్లోకి

ప్రతీకాత్మక చిత్రం

ఈ బోనస్‌ను సింగల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో చెల్లిస్తారు. దసరాకి ముందే బోనస్ వస్తుందని ప్రకాష్ జావదేకర్ తెలిపారు.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘2019 - 2020 సంవత్సరానికి సంబంధించి ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్, నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల 30 లక్షలకు పైగా నాన్ గెజిటెడ్ ఉద్యోగులు బోనస్ ద్వారా లబ్ధి పొందుతారు. బోనస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.3737 కోట్లు ఆర్థిక భారం పడుతుంది.’ అని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ తెలిపారు. అలాగే ఈ బోనస్‌ను సింగల్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లిస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలో చెల్లిస్తారు. దసరాకి ముందే బోనస్ వస్తుందని ప్రకాష్ జావదేకర్ కేబినెట్ మీటింగ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్‌లో స్పష్టం చేశారు.



    కేంద్రం ప్రకటించిన బోనస్‌ రైల్వే, పోస్టల్, డిఫెన్స్, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్ఐసీ వంటి వాటిలో సుమారు రూ.16.7 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్‌‌కు అందుతుంది. నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ రూ.13.70 లక్షల మంది నాన్ గెజిటెడ్ సెంట్రల్ గవర్న‌మెంట్ ఎంప్లాయిస్ అందుకుంటారు.

    ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనాంజా ప్రకటించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు రూ.10,000 అడ్వాన్స్ పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ దీనికి అర్హులే. అలాగే, 2021 మార్చి 31 లోపు ఈ సౌకర్యాన్ని వారు వినియోగించుకోవచ్చు. ఈ స్కీమ్ కింద స్పెషల్ ఫెస్టివల్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10,000 మంజూరు చేస్తారు. దానికి ఎలాంటి వడ్డీ ఉండదు. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి పండుగ స్పెషల్ ప్యాకేజీ సౌకర్యాన్ని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గఆ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అడ్వాన్స్ తీసుకునే సౌకర్యం ఉంది. ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తారు. మళ్లీ ఆ డబ్బులను తిరిగి చెల్లించడానికి అత్యధికంగా 10 వాయిదాలు అవకాశం ఇస్తారు. అంటే, ఈ పథకం కింద అడ్వాన్స్ తీసుకున్నవారు 10 ఇన్‌స్టాల్ మెంట్లలో రూ.10,000 తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

    ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద ప్రతి ఉద్యోగికి రూ.10,000 అడ్వాన్స్ ఇస్తుంది. ఈ అడ్వాన్స్‌ను పది ఇన్‌స్టాల్‌మెంట్లలో తిరిగి తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ.4000 కోట్లు కేటాయించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం వల్ల సుమారు 48 లక్షల మందికి లబ్ది జరగనుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: