హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వలస కార్మికులకు ఉచిత ఆహారధాన్యాలు.. కేంద్ర కేబినెట్ ఆమోదం

వలస కార్మికులకు ఉచిత ఆహారధాన్యాలు.. కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)

ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)

వలస కార్మికులకు ఆహార ధాన్యాలను అందించేందుకు మొత్తం రూ.Rs.3,109.52 కోట్లను కేటాయించింది. ఆ నిధుల కేటాయింపుకు ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది.

ఆత్మ నిర్భర్ అభియాన్ భారత్‌లో భాగంగా వలస కార్మికులకు 2 నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమానికి నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల చిక్కుకున్న వలస కార్మికులు మే, జూన్ నెలలో ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తారు. ఆహార భద్రతా కార్డు, రేషన్ కార్డు లేకున్నా ప్రతి కుటుంబానికి 5 కేజీల బియ్యం లేదా గోధుమలు ఇస్తారు. దీని వల్ల దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ఆహార సబ్సిడీకి రూ.2,982.27 కోట్లు ఖర్చవుతాయి. ఇక రవాణా, డీలర్ మార్జిన్, హ్యాండ్లింగ్ చార్జీలు కలుపుకొని మరో 127.25 కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికులకు ఆహార ధాన్యాలను అందించేందుకు మొత్తం రూ.Rs.3,109.52 కోట్లను కేటాయించింది. ఆ నిధుల కేటాయింపుకు ఇవాళ కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది.

First published:

Tags: Atma Nirbhar Bharat Abhiyan, Central cabinet, Migrant Workers, Pm modi

ఉత్తమ కథలు