హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PMAY-Rural plan: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ పథకం గడుపు పెంపు.. రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు ఇలా..

PMAY-Rural plan: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ పథకం గడుపు పెంపు.. రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు ఇలా..

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)

PMAY-Rural plan: సొంతంగా ఇళ్లు నిర్మించుకోవాలని కళలు కనేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్​​ యోజన గ్రామీణ పథకం (PMAY-Rural plan) గడువును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

పేదల సొంటింటి కల కోసం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్​​ యోజన గ్రామీణ పథకం (PMAY-Rural plan) గడువును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్​ను ప్రారంభించింది. దశల వారీగా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారులకు ఏకంగా రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఈ స్కీమ్​ను 2021 మార్చి వరకు మాత్రమే అమలు చేయాలని భావించింది. కానీ ఇప్పుడు 2024 మార్చి వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. స్కీమ్ పొడిగింపు నిర్ణయానికి కేబినెట్​ ఆమోదం తెలిపింది.

మార్చి 31, 2021 నాటికి మిగిలి ఉన్న 155.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కాగా, పీఎంఏవైజీ కింద 2.95 కోట్ల గృహాలను నిర్మించాలని కేంద్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యంలో ఇంకా 155.75 లక్షల గృహాల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 'అందరికీ ఇళ్లు' అందించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్​ను ప్రభుత్వం ప్రారంభించింది.

* కెన్​బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్​కు ఆమోదం..

‘‘2021 నవంబర్ 29 వరకు మొత్తం 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని పెట్టుకున్న లక్ష్యంలో ప్రస్తుతం1.65 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 2022 ఆగస్టు 15 నాటికి 2.02 కోట్ల ఇళ్లు పూర్తవుతాయని అంచనా వేస్తున్నాం. దీంతో మిగిలిన లక్ష్యాన్ని చేరుకోవడానికి పథకాన్ని 2024 మార్చి వరకు కొనసాగించాల్సిన అవసరం ఉంది.” అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఇది కూడా చదవండి : బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిపోవడానికి ఒక్క క్షణం ముందు వీడియో ఇది..

దీనితో పాటు 44,605 ​​కోట్ల అంచనా వ్యయంతో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కూడా కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ. 39,317 కోట్ల కేంద్ర మద్దతు, రూ. 36,290 కోట్ల గ్రాంట్, రూ. 3,027 కోట్ల రుణాన్ని అందజేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇది కూడా చదవండి : వీవీఐపీల హెలికాప్టర్‌ ఇదే! ప్రమాదానికి కారణాలు ఇవే అని తేల్చిన వాయుసేన

ఈ ప్రాజెక్ట్ ద్వారా బుందేల్‌ఖండ్ ప్రాంతానికి, మధ్య ప్రదేశ్​, ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రాలకు నీటి కొరత తీర్చనుంది. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్‌లోని పన్నా, తికమ్‌గఢ్, ఛతర్‌పూర్, సాగర్, దామోహ్, డాటియా, విదిషా, శివపురి, రైసెన్ జిల్లాలతో పాటు యూపీలోని బందా, మహోబా, ఝాన్సీ & లలిత్‌పూర్ జిల్లాలకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.

First published:

Tags: Central cabinet, Central governmennt, House, PM Narendra Modi

ఉత్తమ కథలు