హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం...ఆత్మనిర్భర్ భారత ప్యాకేజీ ఆమోదించే అవకాశం...

కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం...ఆత్మనిర్భర్ భారత ప్యాకేజీ ఆమోదించే అవకాశం...

కేంద్ర కేబినెట్ సమావేశం

కేంద్ర కేబినెట్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్, క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించిన కొన్ని ప్రకటనలు ఆమోదించే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్, క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీకి సంబంధించిన కొన్ని ప్రకటనలు ఆమోదించే అవకాశం ఉంది. స్వయం సమృద్ధి భారత ప్యాకేజీ కింద, కొన్ని ప్రకటనలు ఇప్పటికే ఆమోదించారు. అయితే ఈ ప్రకటనలను త్వరలో అమలు చేయాలని పిఎం మోడీ కోరుతున్నారు. ఇందుకోసం కేబినెట్ నుంచి అనుమతి అవసరం. మిగిలిన ప్రకటనలను ఈ రోజు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదించిన వెంటనే, ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఇంకా కేబినెట్ ఆమోదించలేదు. ఈ సందర్భంలో నేటి క్యాబినెట్ సమావేశం చాలా ముఖ్యమైనది. ఇక క్యాబినెట్ సమావేశంలో బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన నిబంధనలను చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇది కాకుండా, కుషినగర్ విమానాశ్రయానికి సంబంధించిన పెద్ద నిర్ణయం సమావేశంలో ఉండనుంది. దీనిపై కొన్ని అవగాహన ఒప్పందాలు ఉండవచ్చు.

వీధి వ్యాపారులకు 10 వేల రుణం...

2020 జూన్ 1 న కేంద్ర మంత్రివర్గం సమావేశంలో వీధి వ్యాపారులకు రుణ పథకాన్ని ప్రకటించారు. పట్టణ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రత్యేక సూక్ష్మ రుణ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిన్న దుకాణాలు లేదా వీధి వ్యాపారులు రుణాలు తీసుకోవచ్చు. 50 లక్షలకు పైగా దుకాణదారులకు దీని ప్రయోజనం లభిస్తుంది. ఈ విభాగంలో సెలూన్లు మరియు పాన్ షాపులు కూడా వస్తాయి. 10,000 రూపాయల రుణం ఇవ్వనున్నారు. సకాలంలో చెల్లించే వారికి 7 శాతం వడ్డీ తగ్గింపు ఇవ్వనున్నారు.

First published:

Tags: Central cabinet

ఉత్తమ కథలు