ఎనిమిది సంవత్సరాల వయసు నిండక ముందే భోపాల్‌కు చెందిన అద్రిక.. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ గెలుచుకుంది. ఏకంగా 20వేల మంది చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చిది. ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ ఒలింపియాడ్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఎన్నో ధైర్యసాహసాలు ప్రదర్శించి వందలాది మందికి ఆకలి తీర్చి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి గతేడాది బ్రేవరి అవార్డు గెలుచుకుంది. చిన్నవయసులో ఇన్ని ఘనతలు సాధించిన అద్రిక విజయాల వెనుక ఎంతో కష్టం ఉంది.
ఆరేళ్ల వయుసులో భారీ ప్రమాదం

అద్రిక
అద్రికకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఇంట్లో గ్యాస్ పేలి ప్రమాదం జరిగింది. ఆ చిన్నారి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక అద్రిక నడవకపోవచ్చని డాక్టర్లు చెప్పారు. అయితే కాళ్లు గట్టిపడేందుకు తండ్రి.. అద్రికను తైక్వాండో ట్రైనింగ్‌కు పంపారు. అయితే తైక్వాండో అత్యంత వేగంగా నేర్చుకున్న అద్రిక అనతి కాలంలోనే చాంపియన్‌గా అవతరించింది. రెండేళ్లలోనే బ్లాక్‌బెల్ట్ సాధించింది. ఆ తర్వాత ఏకంగా 20వేల మంది చిన్నారులకు తైక్వాండోలో శిక్షణ ఇచ్చింది.
వందలాది మంది ఆకలి తీర్చి.. బ్రేవరీ అవార్డు సాధించి
ఎస్సీ, ఎస్సీ అట్రాసిటీ ఆందోళనల్లో భాగంగా 2018, ఏప్రిల్ 2న చంఢీగఢ్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరిగింది. రైలు మధ్యలోనే ఆగిపోయింది. ఆందోళనకారుల వల్ల వందలాది మంది ప్రయాణికులు ఆకలితో అలమటించారు. ఆ సమయంలో సోదరుడు కార్తీక్‌తో కలిసి అద్రియా వారికి ఆహారం అందించింది. ఇలా వందల మంది ప్రయాణికులకు ఆహారం అందించింది. ఆహారంతో పాటు నీటిని అందించింది. ఈ సేవలకు గుర్తింపుగా అద్రియా, కార్తీక్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2019లో బ్రేవరి అవార్డు అందించారు.
అలాగే ఒకటో తరగతి నుంచి అద్రియా అన్ని తరగతుల్లోనూ టాపర్‌గా నిలుస్తోంది. అలాగే మూడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను సైతం దక్కించుకుంది. అలాగే అద్రియా సోదరుడు కార్తీక్ సైతం జాతీయస్థాయిలో యంగెస్ట్ స్కెచర్గా రికార్డు సాధించాడు.