దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్నార్లులో ప్రతిభావంతులను వెలికితీసేందుకు న్యూస్18, బైజూస్ సంయుక్తంగా 'బైజూస్ యంగ్ జీనియస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలమేధావులను గుర్తించింది. వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతోంది. విజయవంతంగా ముందుకు సాగుతున్న బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమంలో ఈ వారం మరో ఇద్దరు చిచ్చర పిడుగులు మన ముందుకు రానున్నారు. అందులో మొదటి వారు సుహాన సైని కాగా, మరొకరు సిద్ధార్థ్ గోపాల్. ఇందులో సుహానా సైనీ అండర్-15 విభాగంలో భారత నంబర్ 1, ప్రపంచలంలోనే 22 వ టేబుల్ టెన్నీస్ ప్లేయర్. సిద్ధార్థ్ కుమార్ గోపాల్ 2020 ఏడాదికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ శక్తి పురస్కార్ గ్రహీత.
సుహానా ఇప్పటి వరకు 50 అంతర్జాతీయ, జాతీయ కాంపిటేషన్స్ లో మెడల్స్ సాధించారు. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నీస్ ఫెడరేషన్ టోర్నమెంట్స్ లోనూ ఆమె సత్తా చాటారు. 2018లో ఆమె సౌత్ ఆసియా టేబుల్ టెన్నీస్ చాంపియన్ గా నిలిచారు. ఆమె తల్లిదండ్రులిద్దరు జాతీయ స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారులే కావడం విశేషం. వారిని ఆదర్శంగా తీసుకుని, వారి శిక్షణతోనే సుహానా ఈ స్థాయికి చేరుకున్నారు. ఒలంపిక్స్ లో సత్తా చాటడమే లక్ష్యంగా సుహాన సాధన చేస్తున్నారు. సుహాన తన ఆరేళ్ల వయస్సు నుంచే సాధన ప్రారంభించింది.
సిద్ధార్థ్ కుమార్ గోపాల్ విషయానికి వస్తే అతను సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలంపియాడ్ లో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ యూత్ మథ్స్ ఛాలెంజ్లో బంగారు పథకాలను అందుకున్నాడు. అనేక అంతర్జాతీయ స్థాయి మాథ్స్ కాంపిటేషన్స్, ఒలంపియాడ్స్ లో అతను సత్తా చాటాడు. "అతను 1 వ తరగతి నుండే ఒలింపియాడ్స్కు హాజరుకావడం ప్రారంభించాడు. అతను తన తరగతి భాగాలను చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడని మరియు గణితం మరియు విజ్ఞాన శాస్త్రంలో కూడా బాగా రాణిస్తున్నాడని మేము గ్రహించాము"అని సిద్ధార్థ్ తల్లి వందన అన్నారు.
న్యూస్18, బైజూస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'బైజూస్ యంగ్ జీనియస్' ఎపిసోడ్స్ ప్రతీ శనివారం, ఆదివారం టెలికాస్ట్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.