BYJU'S Young Genius మొదటి ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ లో మ్యూజిక్ లో రాణిస్తున్న లిడియాన్ నాధసవరం(15), అద్భుతమైన మెమోరీ కలిగిన మెఘాలి మాలబిక(14) కనిపించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ వీరికి మార్గదర్శకం చేయనున్నారు. లిడియాన్ పియానోను నిమిషానికి 190 బీట్స్ స్పీడ్ తో ప్లే చేస్తారు. ఇందుకు గాను ఆయన 2019లో వరల్డ్ బెస్ట్ గా నిలిచారు. ప్రఖ్యాతి గాంచిన Ellen DeGeneres Showలోనూ అతను కనిపించడం విశేషం. అతను ఇటీవల Atkan Chatkan చిత్రంలో నటించాడు కూడా. మోహన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న Barroz చిత్రానికి సంగీతం కూడా కంపోజ్ చేస్తుండడం విశేషం. సినిమాలోని నటన, ఎమోషన్స్ ను సంగీతంలో చూపించడం తనకు ఇష్టమని అతను చెబుతున్నాడు.
లిడియన్ తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు ప్రశాంతమైన వాతావరణంలో వృద్ధి చెందాలన్న లక్ష్యంతో అనేక ప్రాజెక్టులను తిరస్కరించామన్నారు. Barroz పూర్తయిన తర్వాత తర్వాత ప్రాజెక్టు గురించి తమ కుమారుడు ఆలోచిస్తాడన్నారు. ప్రాజెక్టుల వెనక తమ కుమారుడు పరిగెత్తాలని తాము కోరుకోవడం లేదన్నారు.
తమ కూతురు కూడా మ్యూజీషియన్ అని అతడు చెప్పాడు. తమ పిల్లలు తప్పులు చేసిన సమయంలో వారిలోని పాజిటీవ్ అంశాలపైనే తాను దృష్టి పెడతాన్నారు. తద్వార పిల్లలపై ఒత్తిడి ఉండదన్నారు.
ఈ ఎపిసోడ్ లో మచ్చే మరో అద్భుతమైన ప్రతిభ కలిగిన చిన్నారి మెఘాలి. ఈ చిన్నారి ఇప్పటికే నాలుగు అవార్డులు సాధించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించారు. 'Google Girl of India.'గా ఆ చిన్నారి పేరు సాధించింది. ఈ సందర్భంగా మేఘాలి మాట్లాడుతూ.. తాను ‘గూగుల్ గర్ల్’ గా పేరు సాధించేందుకు సహాయపడిన తన తండ్రికి తాను కృతజ్ఞత కలిగి ఉంటానన్నారు. జియోగ్రఫీతో పాటు వాయిలిన్ సోలో కాంపిటేషన్లో గోల్డ్ మెడల్ సాధించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. లాక్ డౌన్లో సమయాన్ని తాను ఎలా సద్వినియోగం చేసుకున్నది మెఘాలి వివరిస్తూ.. కొన్ని నావెల్స్ ను కొని చదివానని చెప్పింది. మరి కొన్నింటినీ ఆన్లైన్లో చదివానని వివరించింది. కొన్ని రోజుల తర్వాత ఆన్లైన్ క్లాసులు ప్రారంభం అవడంతో ఎక్కువ సమయాన్ని చదువుకే కేటాయిస్తున్నట్లు తెలిపింది. స్పేస్ సైంటిస్ట్ కావడంతో పాటు తాన కళ్లతో అంతరిక్షాన్ని చూడడమే తన లక్ష్యమని ఆమె చెప్పారు.
మెఘాలి తండ్రి మాట్లాడుతూ.. FIFA World Cup 2010 సమయంలో షకీరా డ్యాన్స్ ను చూసిన నాలుగేళ్ల మెఘాలి తాను షకీరాను చూడాలనుకుంటున్నానని చెప్పిందన్నారు. అయితే షకీర కొలంబియాకు చెందిన వ్యక్తి అని చెప్పడంతో ఆ దేశం ఎక్కడ ఉంటుందని తన కూతురు అడిగిందన్నారు. అయితే మ్యాప్ లో ఆ దేశాన్ని చూపానన్నారు. కొన్ని నెలల తర్వాత ఆ చిన్నారి మళ్లీ మ్యాప్ లో ఆ దేశాన్ని చూపించడం మర్చిపోలేనని అతను గర్వంగా చెప్పారు. BYJU’S Young Genius మొదటి ఎపిసోడ్ రేపు(జనవరి 16న) ప్రసారం కానుంది. ఆదివారం మళ్లీ తిరిగి ప్రసారం అవుతుంది. న్యూస్ 18కి సంబంధించిన అన్ని చానెళ్లలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.