హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BYJU'S Young Genius: ఈ చిన్నారుల రికార్డులు చూస్తే ఔరా అనాల్సిందే.. వీళ్లు మామూలోళ్లు కాదు..

BYJU'S Young Genius: ఈ చిన్నారుల రికార్డులు చూస్తే ఔరా అనాల్సిందే.. వీళ్లు మామూలోళ్లు కాదు..

Byju's Young Genius

Byju's Young Genius

BYJU'S Young Genius: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్నార్లులో ప్రతిభావంతులను వెలికితీసేందుకు న్యూస్18, బైజూస్ సంయుక్తంగా 'బైజూస్ యంగ్ జీనియస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలమేధావులను గుర్తించింది. వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతోంది. విజయవంతంగా ముందుకు సాగుతున్న బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమంలో ఈ వారం మరో ఇద్దరు చిచ్చర పిడుగులు మన ముందుకు రానున్నారు

ఇంకా చదవండి ...

  దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న చిన్నార్లులో ప్రతిభావంతులను వెలికితీసేందుకు న్యూస్18, బైజూస్ సంయుక్తంగా 'బైజూస్ యంగ్ జీనియస్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బాలమేధావులను గుర్తించింది. వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెబుతోంది. విజయవంతంగా ముందుకు సాగుతున్న బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమంలో ఈ వారం మరో ఇద్దరు చిచ్చర పిడుగులు మన ముందుకు రానున్నారు. అందులో ఒకరు తబలా జీనియస్ తృప్తరాజ్ పాండ్య అయితే మరొకరు స్కేటింగ్ లో అవార్డులు కొల్లగొడుతున్న తైలక్ కైషమ్. ఈ చిచ్చరి పిడుగుల్ని సోనుసూద్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు మెంటరింగ్ చేయనున్నారు.

  12 ఏళ్ల తైలక్ కైషమ్ స్కేటింగ్ లో ఎన్నో రికార్డుల్ని కొల్లగొట్టాడు. ఈ బుడతడు పేరు మీద గిన్నిస్ వరల్డ్ రికార్డులు ఉన్నాయ్. 2015 , డిసెంబర్ 20 న బార్ల క్రింద ఎక్కువ దూరం లింబో స్కేటింగ్ చేసిన గిన్నిస్ బుక్ రికార్డును నెలకొల్పాడు. 2016, డిసెంబర్ 31 న తన రికార్డును తానే బద్దలు కొట్టాడు తైలక్. ఏకంగా 145 మీటర్ల దూరం పాటు బార్ల కింద లింబో స్కేటింగ్ చేసి మరో గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. అతడి గత 116 మీటర్ల రికార్డును దీంతో తుడిచిబెట్టాడు తైలక్. అలాగే పొడవైన స్లాలొమ్ వేవ్ చేసినందుకు లిమ్కా బుక్ రికార్డులోకి కూడా తన పేరు లిఖించుకున్నాడు తైలక్.

  Tiluck Keisam

  ఒక రికార్డును సెట్ చేసిన వెంటనే ఆ రికార్డును బ్రేకు చేయాలన్న ఆలోచన తనలో మొదలైందని తెలిపాడు తైలక్. అలాగే, ఈ ప్రతిష్టాత్మక బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. " ఇంతకు ముందు నేను కొంత మందికే తెలుసు. నేను ఒక్కసారి జర్మన్ షో చూశాను. అందులో చిన్నార్లులో ప్రతిభావంతుల గురించి ప్రత్యేకంగా చూపించారు. ఎందుకు ఇలాంటి షో మన భారత్ లో లేదనుకున్నాను. కానీ బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమం మా లాంటి కిడ్స్ కి మంచి వేదికగా మారింది " అని తెలిపాడు తైలక్ కైషమ్. 2023-2024 వింటర్ బలింపిక్స్ భారత్ తరుఫున స్కేటింగ్ లో పాల్గొనడమే తన ఆశయమని తెలిపాడు.

  Truptraj with Prime Minister Narendra Modi

  ఇంకొక అద్భుతమైన ప్రతిభావంత చిన్నారి తబలా జీనియస్ తృప్తరాజ్ పాండ్య. ఈ 13 ఏళ్ల ముంబైకర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ లో ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకున్నాడు. మూడేళ్ల వయస్సులో ఈ బుడతడు ఆల్ ఇండియా రేడియో లో లైవ్ షో చేశాడు. అలాగే నాలుగేళ్ల వయస్సులో దూరదర్శన్ లో లైవ్ షో చేసి వారెవ్వా అన్పించాడు. ఆరేళ్ల వయస్సులోనే తబలా మాస్టర్ గా గిన్నిస్ బుక్ వరల్డ్స్ రికార్డులోకి తన పేరును లిఖించుకున్నాడు తృప్తరాజ్.ఈ రికార్డుపై ఎంతో సంతోషించానని ఈ చిన్నారి తెలిపాడు.

  Truptraj with his father

  తృప్తరాజ్ కి హిందూస్థానీ క్లాసిక్ మ్యూజిక్ మరియు బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. భవిష్యత్తులో ఇండియా తరఫున తబలా మాస్టర్ గా ప్రాతినిధ్యం వహించాలన్నదే తృప్తరాజ్ ఆశయం. రెండేళ్ల వయస్సు నుంచే తబలా వాయించడంలో ప్రత్యేకంగా నిలిచాడు తృప్తరాజ్. ప్రస్తుతం పండిట్ నయన్ ఘోష్ వద్ద శిష్యుడిగా తబలా లో ఇంకా మెళుకువలు నేర్చుకుంటున్నాడు తృప్తరాజ్.

  Truptraj with his family

  న్యూస్18, బైజూస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'బైజూస్ యంగ్ జీనియస్' ఎపిసోడ్స్ ప్రతీ శనివారం, ఆదివారం టెలికాస్ట్ అవుతాయి

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: BYJUS