సరికొత్త కార్యక్రమం BYJU’S Young Genius-A ను "న్యూస్ 18" త్వరలో మనకు మరింత చేరువ చేయబోతోంది. మన భారతదేశంలో ఆవిష్కర్తలు, ఉద్యమకారులు, పర్యావరణ యోధులు, డేటా శాస్త్రవేత్తలు, జిమ్నాస్ట్, నృత్యకారులు, షార్ప్షూటర్లు, సంగీతకారులు, జంతువులను రక్షించేవారి లాంటి ఎంతోమంది మేధావులైన యువకులకు కొదువ లేదు. వారిలో చాలా మంది అతిచిన్న వయస్సులోనే తమ అద్భుతమైన తెలివితేటలతో ప్రతిభావంతులుగా రాణిస్తున్నారు. న్యూస్ 18 రూపొందించిన BYJU'S Young Genius-A కార్యక్రమంతో భారతదేశంలోని అతి పిన్న వయస్సు కలిగి ప్రతిభావంతులైన వజ్రాల లాంటి పిల్లలను వెలుగులోకి తెచ్చి వారిని ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా News18 India, CNN News18, History TV18కు చెందిన అన్ని స్థానిక భాషలకు సంబంధించిన 18 ఛానెల్స్ నుంచి భారతదేశంలోని అత్యంత గుర్తింపు కలిగిన పలువురు ప్రముఖులు వారిలోని ప్రతిభను ప్రశంసించి, వారి సృజనాత్మకతను మెరుగుపరుచుకునేందుకు ప్రోత్సాహిస్తారు. టీవీ ద్వారా 70 కోట్ల మందికి, డిజిటల్లో 20 కోట్ల మంది ప్రేక్షకులకు చేరువై, దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ గా నిలిచింది News18. ఇది ఇక్కడితో ఆగకుండా BYJU’S Young Genius ద్వారా భారతదేశ భవిష్యత్తును నిర్మించే ఒక ప్రత్యేకమైన ఉద్యమంగా మారాలని ఆశిస్తోంది.
ఈ కార్యక్రమం పిల్లలు తమ అభిరుచులను తెలుసుకుని, వాటిని అనుసరించి తమ కలలను సాకారం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుందని Hindi News, News18 Network అధినేత మయాంక్ జైన్ అన్నారు. తమ విశ్వసనీయమైన వార్తలతో భారతదేశంలో కోట్ల మందికి చేరువైన వార్తా చానెల్ News18, ఈ ప్రత్యేకమైన చొరవతో తమ మేథో సంపత్తికి మరింత సృజనాత్మకను జోడించి రాణిస్తున్న యువకుల కథనాలను ప్రేక్షకులకు అందిస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన తెలివితేటలు గల ఈ పిల్లలను దేశంలోని నలుమూలలో ఉన్న ప్రేక్షకుల దృష్టికి తీసుకురావడానికి Network18 కేంద్రంగా మారుతోంది.
BYJU’S ‘Young Genius బాలల దినోత్సవం నాడు'Call for entry' అనే పేరుతో ప్రచారం ప్రారంభం కాగా, దీనికి మంచి స్పందన లభించింది. ఇందులో పాల్గొన్న వారిలో నుండి ఎన్నికైన ప్రతిభావంతుల కథనాలను 11 భాగాలుగా చేసి, "News18" నెట్వర్క్ కు చెందిన 18 ఛానెల్లలో జనవరి 16, 2021 నుంచి ప్రారంభమై ప్రతి శనివారం సాయంత్రం ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం/మధ్యాహ్నం తిరిగి ప్రసారమవతుంది. ప్రతీ ఎపిసోడ్ లో విద్యావేత్తలు, కళల ప్రదర్శనలు, సాంకేతిక విజ్ణానం మరియు క్రీడలు వంటి వివిధ రంగాల నుంచి వచ్చిన మేధావులైన పిల్లలు పాల్గొని, వీక్షకులకు తమ జీవిత ప్రయాణంలోని స్పూర్తిదాయకమైన కథలను వివరిస్తూ, తమ ప్రత్యేకతలను ప్రదర్శిస్తారు.
ప్రోమోను ఇక్కడ చూడండి:
చిన్న వయసులోనే అత్యంత ప్రతిభ కలిగిన మేధావులతో చేతులు కలపడం తమకు చాలా సంతోషంగా ఉందని, “యంగ్ జీనియస్" కోసం సంగీతాన్ని కంపోజ్ చేసే అవకాశం తమకు లభించడం తమ అదృష్టమని, చిన్న వయసులోనే అసాధారణమైన ప్రతిభ ఉన్న పిల్లలను కనుగొని, వారి నైపుణ్యాన్ని పెంచి పోషించే శక్తినిచ్చే అద్భుతమైన ప్రదర్శనలో పాల్గొనడం సంతోషన్ని అందిస్తుందని ప్రముఖ సంగీత స్వరకర్తలు సలీం మరియు సులైమాన్ లు పేర్కొన్నారు.
'తారలకే ధ్రువ తార - వెలిగే ఓ సితారా' అనే ఈ గీతాన్ని శ్రద్ధా పండిట్ రచించగా, సలీం-సులైమాన్ స్వరపరిచి పాడిన ఈ గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లలు తమ పట్టుదలతో దేనినైనా సాధించగలరనే క్లిష్టమైన సందేశాన్ని వారు దీని ద్వారా తెలిపారు. ఈ గీతం భారతదేశం నలుమూలలలో ఉన్న ప్రేక్షకులకు తమతో కలసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానమందిస్తోంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంతోమంది ప్రేక్షకులు తమలో ఎంతో మార్పు కలిగిందని అభిప్రాయపడుతున్నారు. “సులైమాన్ తో కలిసి ఇందులో పాల్గొనడం తనకు చాలా కొత్త అనుభూతిని అందించిందని, అలాగే ఇది తమకు కూడా ఒక అభ్యాస అనుభవంగా ఉంది” అని సలీం మర్చంట్ తెలియజేసారు. "ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది, దానిని గుర్తించి తమ ప్రతిభను వినూత్నంగా ప్రదర్శించే అవకాశాన్ని వారికి అందించాలి. మన దేశంలో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసి తగిన ప్రోత్సాహాన్ని అందించాలని" BYJU మార్కెటింగ్ విభాగ అధినేత అతిత్ మెహతా ఈ కార్యక్రమంలో వెల్లడించారు.
ఇక్కడ వినండి:
చివరి ఎపిసోడ్లలోకి ప్రవేశించిన పిల్లలందరు విభిన్న నేపథ్యాలు మరియు ఆసక్తుల నుండి వచ్చినవారు, కానీ వారందరిలో సమానంగా ఉన్న లక్షణం మాత్రం నేర్చుకోవాలన్న పట్టుదల మరియు అసాధారణమైన ప్రతిభ. Niti Aayog CEO అమితాబ్ కాంత్, పద్మ భూషణ్ డాక్టర్ మల్లికా సారాభాయ్,మాజీ భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్, CNBC-TV18 మేనేజింగ్ ఎడిటర్ షెరీన్ భన్ వంటి మహామహుల నేతృత్వంలో అభ్యర్థుల ఎంపిక కొనసాగుతోంది. చివరగా ఎంపికైన 21మంది పిల్లల ప్రదర్శనలు Network18 ఛానెల్స్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్ లలోని 11 ఎపిసోడ్లలో ప్రసారం చేయబడుతుంది.
ఈ యువ మేధావులను ఉత్సాహపరచడానికి లియాండర్ పేస్, డ్యూటీ చంద్, శంకర్ మహాదేవన్, రాజ్కుమార్ రావు, పివి సింధు, సోను సూద్, సోహా అలీ ఖాన్ మరియు వీరేందర్ సెహ్వాగ్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొంటారు. ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో రూపొందించిన ఈ ప్రదర్శనకు వీరు ఆకర్షణగా నిలవనున్నారు. భారతదేశం నుంచి ప్రపంచానికి ఎంతోమంది మేదావులను అందించాలనే లక్ష్యంతో వీరందరు కలిసి పనిచేసి ఔత్సాహికులను ప్రోత్సహిస్తారు. తమ ప్రదర్శనలతో యువ మేధావులు ప్రేక్షకులను అలరించే సమయంలో వారికి తగిన ప్రోత్సాహాన్ని కలిగించండి!
#BYJUSYoungGenius ని ఫాలో అవడం ద్వారా, https://www.news18.com/younggenius/ ని సందర్శించడం ద్వారా భారతదేశం అంతటా ఉన్న కొన్ని అద్భుతమైన, స్పూర్తిదాయకమైన కథలను తెలుసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.