దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్ సభ (Lok Sabha) స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల (By Elections) ఫలితాలు నవంబర్ 2, 2021న వెలువడ్డాయి. ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులు.. కేంద్రంలో బీజేపీ విధానాలు ఎన్నికలపై ప్రభావం చూపాయి. పలు చోట్ల బీజేపీ (BJP)కి గట్టి ఎదురు దెబ్బ తగలగా.. కొన్ని చోట్ల పార్టీ పట్టు నిలుపుకొంది. ఈ రోజు వెలువడ్డ ఫలితాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిశ్రమ ఫలితాలు (Mixed Results) వచ్చాయి. ఈ స్థానాల్లో దాదాపు 50 శాతం నుండి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మిజోరాం, తెలంగాణ (Telangana), హర్యానా, మేఘాలయ (Meghalaya)లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
హరియాణాలో సాగు చట్టాల ప్రభావం..
హరియాణాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(Indian National Lokdal)) సెక్రటరీ జనరల్ అభయ్ సింగ్ చౌటాలా కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వ్య తిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికలో అభయ్ సింగ్ మళ్లీ విజయం సాధించారు. ఆయన బీజేపీ అభ్యర్థి గోవింద్ కందాపై 6,739 ఓట్లతో గెలిచారు. ఈ ఎన్నికల్లో సాగుచట్టాల ప్రభావం స్పష్టం కనిపించింది.
కేంద్రపాలిత ప్రాంతలో శివసేన..
కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలీలో లోక్ సభ స్థానంలో స్వ తం త్ర ఎంపీ మోహన్ దేల్కర్ ఆత్మహత్యతో ఉప ఎన్నికవచ్చింది. ఈ ఎన్నికలో మోహన్ సతీమణి కళాబెన్ దేల్కర్ శివసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కాం గ్రెస్ నుంచి మహేశ్ దోదీ, బీజేపీ నుంచి మహేశ్ గవిత్ బరిలోకి దిగారు. ఇందులో శివసేన అభ్యర్థి 51,269 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
GST-Petrol Price: ఇటు పెట్రోల్.. అటు జీఎస్టీ వసూళ్లు.. కేంద్రానికి భారీగా ఆదాయం
బెంగాల్లో దీదీ హవా..
జాతీయ స్థాయిలో ఎదగాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సొంత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ (TMC) మెరుగైన ఫలితాలు సాధించింది. దిన్హటా, గోసాబా, శాం తిపుర్, ఖర్దాహ్ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల అన్నింటిలో టీఎంసీ విజయం సాధించింది.
హిమాచల్ హస్తం జోష్
హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లో మండీ లోక్ సభ స్తానంలో బీజేపీ ఎంపీ మ్స్వరూప్ శర్మ మృతి చెందడంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫునుంచి మాజీ సీఎం స్వ ర్గీయ వీరభద్రసిం గ్సతీమణి ప్రతిభాసింగ్ పోటీచేశారు. బీజేపీ నుంచి కార్గిల్ వీరుడు బ్రిగేడియర్ కుషాల్ సింగ్ పోటీ చేయగా కాంగ్రెగస్ అభ్యర్థి విజయం సాధించారు. ఈ నియోజవర్గం రాష్ట్ర సీఎం జైరామ్ ఠాకూర్ సొంత జిల్లాలో ఉంది. ఇది కాకుండా రాష్ట్రంలోని అర్కీ , ఫతేపూర్, జుట్టబ్ కొట్కాయ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది.
కర్ణాటకలో మిశ్రమ ఫలితాలు..
కర్ణాటలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. సిం డ్గీ నియోజకవర్గం లో భాజపా విజయం సాధిం చగా. హం గల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
ఈశాన్యంలో కమల వికాసం..
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం (Assam)లో బీజేపీ హవా కొనసాగించింది. రాష్ట్రంలో జరిగిన ఐదు అసెంబ్లీ స్థానాలకు వెలువడుతున్న ఉప ఎన్ని కల ఫలితాల్లో ఒక చోట భాజపా విజయం సాధిం చగా.. మరో నాలుగు చోట్ల ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
Goa : మమ్మళ్ని గెలిపించండి.. ఉచితంగా తీర్థయాత్రలకు వెళ్లండి!
మధ్య ప్రదేశ్‌లో బీజేపీ హవా
మధ్య ప్రదేశ్‌లోనూ భాజపా హవా కొనసాగిం ది. ఇక్క డి ఖం ద్వా లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది. అంతే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్న మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాల్లో బీజేబీ విజయబావుటా ఎగురవేసింది. ఒక అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది.
తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్
ఇక తెలంగాణలో ప్రత్యే పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ (YSRCP) సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా (Kadapa Dist.) బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది.ఈ ఎన్నికలో తరిఇ వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Assam, Bjp, Congress, Elections, Himachal Pradesh, India, Lok sabha, Madhya pradesh, West Bengal