నేడు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో మూడు లోక్ సభ స్థానాలు, 29 అసెంబ్లీ (Assembly) స్థానాల్లో ఉపఎన్నికలకు ఫలితాలు వెలువడనున్నాయి. ఈ స్థానాల్లో దాదాపు 50 శాతం నుండి 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఎక్కువ పోలింగ్ (Polling) నమోదైన దగ్గర కచ్చితంగా ఉత్కంఠ కలిగించే ఫలితాలు రావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మిజోరాం, తెలంగాణ (Telangana), హర్యానా, మేఘాలయలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. దాద్రా మరియు నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్లోని మండి మరియు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా మూడు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ సభ్యుల మరణంతో లోక్సభ స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.
రాష్ట్రాల వారీగా వివరాలు.. .
13 రాష్ట్రాల్లో 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుజరిగాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాం - గోస్సైగావ్, భబానీపూర్, తముల్పూర్, మరియాని తౌరా
పశ్చిమ బెంగాల్ - దిన్హటా, శాంతిపూర్, ఖర్దా మరియు గోసాబా
మధ్యప్రదేశ్ - జోబాట్, రాయగావ్, ఫృథ్వీపూర్
హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, బ్బల్-కోట్ఖాయ్
మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్, మావ్ఫ్లాంగ్
బీహార్ - తారాపూర్, కుశేశ్వర్
కర్ణాటక - హనగల్, సింద్గి
రాజస్థాన్ - వల్లభనగర్, ధరియావాడ్
ఆంధ్రప్రదేశ్ - బద్వేల్
తెలంగాణ - హుజూరాబాద్
హర్యానా - ఎల్లెనాబాద్
మహారాష్ట్ర - డెగ్లూర్
మిజోరాం - తురియాల్
Goa : మమ్మళ్ని గెలిపించండి.. ఉచితంగా తీర్థయాత్రలకు వెళ్లండి!
అన్ని స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రచారం సాగాయి. పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువగా రైతు చట్టాల చుట్టూ ప్రతిపక్ష, అధికార పక్షాలు ప్రచారం నిర్వహించాయి. ఆశ్చర్యకరంగా పలు ఎమ్మెల్యే స్థానాల్లోనూ గ్యాస్, పెట్రోల్ ధరలు ప్రధానంశాలుగా అభ్యర్థులు ప్రచారం చేయడం విశేషం.
తెలంగాణ (Telangana) లో వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు తెరలేపిన ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక. రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఎన్నికలు కావడం, రెండు దశాబ్దాలకుపైగా ఆయనకు ఆత్మీయుడిగా ఉండి, అనూహ్య పరిస్థితుల్లో గెంటివేతకు గురైన ఈటల రాజేందర్ (Etela Rajender) భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో హుజూరాబాద్ ఫలితంపై సర్వత్రా ఎనలేని ఆసక్తి ఏర్పడింది. రికార్డు స్థాయిలో (86.64 శాతం) పోలింగ్ జరిగింది.
GST-Petrol Price: ఇటు పెట్రోల్.. అటు జీఎస్టీ వసూళ్లు.. కేంద్రానికి భారీగా ఆదాయం
కడప జిల్లా (Kadapa District) బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election) పోలింగ్ ముగిసింది. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 60శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 2019లో కంటే తక్కువగానే ఓట్లు పోలయ్యాయి. మొత్తం 281 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. బద్వేలులో 2,15,292 మంది ఓటర్లు ఉండగా.. 68.12 శాతం పోలింగ్ నమోదైంది. 2019లో ఇక్కడ 77.64 శాతం పోలింగ్ నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elections, National News