#ButtonDabaoDeshBanao : ఓటింగ్ పెంపుదలకు మార్గాలేంటి ?

ముంబైలో సుమారు 10 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ రోజు, ఏప్రిల్ 29, 2019 నాడు కేవలం 55.1% మాత్రమే ఓటు వేయడానికి వచ్చారు. 1989 నుంచి ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌లో అత్యధికం 57.7%  అని గణాంకవేత్తలు, నిపుణులు ఊరట చెందినప్పటికీ, 2019లో మాత్రం ఇప్పటికీ ఓటు వేసినవారి సంఖ్య చాలా తక్కువే.

news18-telugu
Updated: May 18, 2019, 11:26 PM IST
#ButtonDabaoDeshBanao : ఓటింగ్ పెంపుదలకు మార్గాలేంటి ?
బటన్ దబావో దేశ్ బచావో (ఫైల్ చిత్రం)
  • Share this:
ముంబై కలల నగరంగా, భారతదేశం ఆర్థిక రాజధానిగా అలాగే మ్యాగ్జిమం సిటీగా కూడా పేరు గాంచింది. అయితే, అది అత్యధిక ఓటర్ ఉదాసీనత గల నగరంగా కూడా పిలవబడుతుంది. న్యూస్ 18 ఇండియాకి చెందిన ఆనంద్ నరసింహన్ ఇందుకు గల కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నించారు. ఇదే విషయంపై అతను ఒక ప్రముఖ ప్యానెల్ నుండి సమాచారం మరియు అభిప్రాయం కోరారు. ప్రఖ్యాత నటుడు రాజా మురాద్, మాజీ ఐపిఎస్ ఆఫీసర్ సుధాకర్ సురాద్కర్, న్యాయవాది అభా సింగ్ మరియు స్టాండ్-అప్ హాస్యనటుడు దీనిపై లోతైన పరిశీలనకు ఒకచోట చేరారు.

ముంబైలో సుమారు 10 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ రోజు, ఏప్రిల్ 29, 2019 నాడు కేవలం 55.1% మాత్రమే ఓటు వేయడానికి వచ్చారు. 1989 నుంచి ఇప్పటివరకు నమోదైన పోలింగ్‌లో అత్యధికం 57.7%  అని గణాంకవేత్తలు, నిపుణులు ఊరట చెందినప్పటికీ, 2019లో మాత్రం ఇప్పటికీ ఓటు వేసినవారి సంఖ్య చాలా తక్కువే.

సన్నిహితంగా పరిశీలించిన మీదట, ఈ శాతం ఒక చిన్న ఓటరు బేస్ సంఖ్యకు వ్యతిరేకంగా ఉందని తెలుస్తుంది. ఎన్నికల సంస్కరణలు 2011- 2012, అనేక మంది బోగస్ మరియు నకిలీ ఓటర్లను ఎన్నికల చిట్టా నుంచి తొలగించేసాయి. ఈ కారణం కూడా శాతాల్లో కనిపించే చిన్న పెరుగుదలకు ఆపాదించబడింది.

ముంబైలోని ఆరు నియోజక వర్గాలలో, సంపన్నులైన దక్షిణ ముంబై నియోజకవర్గం, ఓటు వేయడానికి ఓటర్లు అతి తక్కువగా వచ్చిన నియోజకవర్గాల్లో ఒకటి. కొలాబా మరియు కఫ్ఫే పరేడ్ ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. ఇవి ముంబై అలాగే భారతదేశం లోని అత్యంత ధనిక ప్రాంతాలుగా  ఉన్నాయి. వాస్తవానికి, దక్షిణ ముంబై ఆస్తి ధరల్లో ప్రపంచంలోని టాప్ స్థానాల్లో ఒకటి.

ఆనంద్ నరసింహన్ అలాగే అతని గౌరవనీయులైన ప్యానెల్ మధ్య చర్చల్లో భాగంగా, ముంబైలో ఓటర్ల ఉదాసీనతకు సంబంధించిన కొన్ని సమస్యలను వెలుగులోకి వచ్చాయి. కొన్ని పరిష్కారాలు కూడా ఇవ్వబడ్డాయి. ఓటు వేసే విషయంలో ముంబైఎందుకు ఉదాసీనంగా ఉంటుంది? ఈ విషయంలో అనేక ప్రతిపాదనలు ఉన్నాయి.

కొన్ని అభిప్రాయాలు ఇవి:
  • ముంబై, బాగా సుసంపన్నమైన నగరం అవడంతో, విద్యుత్తు, నీరు, మంచి రహదారులు, రవాణా మొదలైనటు వంటి ప్రాధమిక పౌర సదుపాయాలు లేకపోవటం అంటూ ఉండదు. వారి ప్రాథమిక అవసరాలు అన్నీ నెరవేరుతూ మరియు వారు ఎన్నడూ ఎటువంటి అసౌకర్యాలను ఎదుర్కొని ఉండకపోవడంతో ప్రజలు ఓటు వేయడం పట్ల ఆసక్తి  కలిగి ఉండరు.

  • ముంబై ఏకాంతంగా జీవిస్తుంది, మరియు 'అసలైన' భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల నుండి డిస్కనెక్ట్  అయి ఉంటుంది.

  • ముంబయివాసుల అవగాహన ఏమిటంటే ప్రభుత్వం నుండి ఎలాంటి నిజమైన సహాయం లేకుండా వారు తమను తాము స్వయంగా సంరక్షించుకోగలరని. నిజానికి, ఒక అహంకారం ప్రవేశించింది.

  • ప్రభుత్వంతో మంచి ఎంపికలు అలాగే భ్రమలు ఏమీ లేకుండా, పని చేస్తూ ఉండటం తీసుకుదగిన ప్రో-యాక్టివ్ చర్యలు తీసుకోవాలి.

  • వారి ప్రతి ఒక్క ఓటు యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించండి మరియు దానిని వినియోగించుకోవలసిందిగా వారిని ప్రోత్సహించండి

  • ప్రతి అర్హతగల పౌరులు ఎన్నికలలో తమ ఓటును వేయవలసిన తప్పనిసరి ఓటింగ్ కోసం ఒక చట్టం బహుశా అమలు చేయవలసి  ఉంది.

  •  అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, యోగ్యతలు అతి తక్కువ సంఖ్యలో ఉన్నవారిని ఎంచుకోండి లేదా NOTA నొక్కండి, తద్వారా పరిగణించదగిన నేతలుగా మీరు వారిని చూడటం లేదు అనే సందేశం రాజకీయ పార్టీలకు చేరుతుంది.

  • మహిళా ఓటర్లకు అవగాహన కల్పించడానికి మరియు పోలింగ్ రోజున వారిని బయటకు తీసుకురావడానికి గడప నుండి గడపకు ప్రచారాలు చేయాలి.

  • ఎన్నికల రోజున వారు ఓటు వేసినట్లు నిరూపించిన వ్యక్తులను మాత్రమే థియేటర్లు, రెస్టారెంట్లు మరియు ఇతర విశ్రాంతి మరియు వినోద ప్రదేశాలు లోపలికి అనుమతించాలి.


ముగింపు

మీ ఓటు మీ ప్రాథమిక హక్కు. ఇది మీ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరియు మీ స్వరం. ఈ హక్కు మీకు 5 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి మరియు మీరు ఎంచుకునే మంచి పరిపాలనను తీసుకురావడానికి మరియు మీ దేశానికి మరియు రాబోయే తరాల కోసం ఒక ఉజ్జ్వల భవిష్యత్తు తీసుకురావడం కోసం మీ ఓటు వేయండి. ఏప్రిల్ 29, 2019న 4వ దశలో ముంబయి ఓటు వేసింది. ఓటు వేయడానికి వచ్చినవారు కేవలం 55.1 శాతం మాత్రమే ఉన్నారు.

బటన్ దబావో దేశ్ బనావో అనేది, ప్రస్తుతం జరుగుతున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్‌పి సంజీవ్ గోయింకా గ్రూప్ ద్వారా చేపట్టిన ఒక నెట్‌వర్క్ 18 ఇనిషియేటివ్. హాష్ ట్యాగ్ #ButtonDabaoDeshBanao ఉపయోగించి సోషల్ మీడియాలో సంభాషణను అనుసరించండి.
First published: May 18, 2019, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading