Home /News /national /

#ButtonDabaoDeshBanao: ఓటు మీ ప్రజాస్వామ్య హక్కు.. దానిని వినియోగించుకోండి

#ButtonDabaoDeshBanao: ఓటు మీ ప్రజాస్వామ్య హక్కు.. దానిని వినియోగించుకోండి

బటన్ దబావో దేశ్ బచావో (ఫైల్ చిత్రం)

బటన్ దబావో దేశ్ బచావో (ఫైల్ చిత్రం)

#ButtonDabaoDeshBanao అనేది ప్రస్తుతం నడుస్తున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయెంకా గ్రూప్ ద్వారా సమర్పించబడిన ఒక నెట్వర్క్ 18 ప్రోత్సాహం.

  1947 తర్వాత, భారతదేశం ఒక ప్రజాస్వామ్యం అయింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం తన పౌరులకు ఓటువేసే, తమ నాయకులను ఎన్నుకునే హక్కును ఇచ్చింది. ఒక ప్రజాస్వామ్య హక్కుగా ఉన్నప్పటికీ, అనేక మంది పౌరులు, ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఈ హక్కును వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజును ఒక సెలవు దినంగా భావించి స్నేహితులు, కుటుంబ సభ్యులతో రిలాక్స్ అవాలని కోరుకుంటారు. ప్రస్తుతం, 17వ సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు ప్రాముఖ్యత, దానిని ఎందుకు వేయాలి? అనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మీడియా ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు 2019 ఆరు దశలు ముగిసాయి. చివరి దశ మే 19 న జరగనుంది. వారణాసిలో ఆ రోజు ఎన్నికలు జరగనున్నాయి. న్యూస్ 18 ఇండియా రిపోర్టర్ నేహా పంత్ వారణాసిలో ఓటర్ల భావాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దందార్ బెనారసి, మంజులా చతుర్వేది, సనా సబా, వివేక్ బరాల్వాల్ లాంటి ప్రముఖులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు. ‘ఇది మీ ఓటు. మీరే వేయాలి’ అని ప్రజలకు స్పష్టీకరించారు.

  ‘మీ ఒక్క ఓటుకి మార్చే శక్తి ఉంటుంది. ఒక్క ఓటే కదా అని పట్టించుకోనక్కర్లేదని మీరు అనుకోవచ్చు. వేలాది మంది ప్రజలు అదే విధంగా ఆలోచిస్తారు. అలా వేలమంది ఓటు వేయకుండా ఉండిపోయినప్పుడు, అవాంఛనీయమైన, అసమర్థమైన, సొంతానికి సేవ చేసుకునే అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందుతారు. మనం బలహీన నాయకత్వాన్ని భరించాలి.’ అని వక్తలు అభిప్రాయపడ్డారు.

  బుల్లెట్ కంటే ఓటు శక్తివంతమైనది
  మీ ఓటుకి ఒక అసమర్థ ప్రభుత్వాన్ని బయటికి పంపివేసి నాయకత్వంలో మార్పు తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంటుంది. ఓటర్లు తమకు బయటికి దారి చూపిస్తారని తెలిసినప్పుడు పాలక పార్టీ కూడా నిశ్చింతగా ఉండదు. మీ ఓటు వ్యక్తీకరణకు ఒక మార్గం. అది మీ స్వరం. మీరు చెప్పేది వినిపించేలాగా చేసుకునే ఈ హక్కును కోల్పోకండి.

  ఈ ప్రజాస్వామ్య హక్కును గౌరవించండి
  ఓటు వేసేందుకు హక్కు, భారత ప్రజాస్వామ్య పౌరునిగా మీ హక్కు. ఈ బాధ్యతను ఉపయోగించుకోండి. మీ హక్కును గౌరవించండి. మీ ఓటు వేయండి. దేశం కోసం, మీ కోసం, మీ పిల్లల కోసం ఒక ఉజ్జ్వల భవిష్యత్తు తీసుకు రండి. మీ ఓటుతో దేశాన్ని శక్తివంతం చేయండి.

  చిన్న చిన్న నీటి బొట్టు కలిసి మహాసముద్రాలు అయినట్లే, ప్రతి ఒక్క ఓటు సుపరిపాలన ప్రవేశపెట్టడానికి, ఒక సూపర్ పవర్ అయ్యే దిశగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, మీ ఒక్క ఓటు ఎంతో శక్తివంతమైనది. నిజానికి పదునైన కత్తి కంటే బలమైనది. వారణాసిలో మే 19, 2019న పోలింగ్ జరుగుతుంది. ఇది పోలింగ్ యొక్క చివరి దశ. 17వ లోక్‌సభ ఎన్నికల తుది తీర్పు సమయం.

  నెట్‌వర్క్ 18 తో ఆర్‌పీ- సంజీవ్ గోయెంకా గ్రూప్, దేశం పట్ల వారి బాధ్యతతో కొనసాగుతున్నారు. ఓటు వేయండి మీ బాధ్యతని కూడా నెరవేర్చండి. బటన్ దబావ్ దేశ్ బనావ్ అనేది ప్రస్తుతం నడుస్తున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయెంకా గ్రూప్ ద్వారా సమర్పించబడిన ఒక నెట్వర్క్ 18 ప్రోత్సాహం. #ButtonDabaoDeshBanao హ్యాట్ టాగ్‌ను మీరూ అనుసరించండి.
  First published:

  Tags: Lok Sabha Election 2019, News18

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు