Home /News /national /

#ButtonDabaoDeshBanao : ఓటరు ఉదాసీనత: పట్టణాలు వర్సెస్ గ్రామీణం

#ButtonDabaoDeshBanao : ఓటరు ఉదాసీనత: పట్టణాలు వర్సెస్ గ్రామీణం

బటన్ దబావో దేశ్ బచావో (ఫైల్ చిత్రం)

బటన్ దబావో దేశ్ బచావో (ఫైల్ చిత్రం)

బటన్ దబావో దేశ్ బనావో అనేది, ప్రస్తుతం నడుస్తున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయెంకా గ్రూప్ ద్వారా సమర్పించబడిన ఒక నెట్వర్క్ 18 ఇనీషియేటివ్.

  మే 12న సార్వత్రిక ఎన్నికలు 2019 ఆరో దశ ముగిసింది.ఈ ఆరు దశల్లోనూ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటరు శాతం ఎక్కువగా ఉంది. ఈ ధోరణిని విశ్లేషించడానికి, న్యూస్ 18 ఇండియా డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్ కిషోర్ అజ్వాని, మీడియాలోని ప్రముఖులతో ఓ ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. న్యూస్ 18 ఇండియా పొలిటికల్ ఎడిటర్, అమితాబ్ సిన్హా, ఫస్ట్ పోస్ట్ ఎడిటర్ బీవీ రావ్ తో కలిసి CNN న్యూస్ 18 సంపాదకులు భూపేంద్ర చౌబే, పల్లవి ఘోష్ ఈ విషయంపై మేథోమథనం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడాలను వారు సహేతుకంగా విశ్లేషించారు.

  పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరడగానికి ప్రధాన కారణం ఆలోచనా విధానమే. నగరాలు, గ్రామీణుల ఆలోచనా విధానంలో వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలు సంపన్నమైనవి. అన్ని వసతులు, సైకర్యాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. మెరుగైన పరిపాలనను తీసుకురావలసిన అవసరం వారికి అనిపించదు. చిన్న చిన్న టౌన్లు, గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వ సేవలమీదే ఎక్కువగా ఆధారపడి ఉంటారు. అందువల్ల, వారు తమ రాతను మెరుగుపర్చుకోవలసిన అవసరాన్ని గుర్తిస్తారు. వారు ఎంపిక చేసుకున్న అభ్యర్థికి ఓటు వేస్తారు.

  ముంబై, బెంగుళూరు లాంటి ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో రిలయన్స్, టాటా వంటి ప్రైవేటు కంపెనీలు నిర్వహణ, విద్యుత్ వంటి కొన్ని పౌర సౌకర్యాల సదుపాయం అందజేసే బాధ్యత కలిగి ఉంటాయి. ఇది నగర ప్రజల దృష్టిలో ప్రభుత్వం యొక్క పాత్రను చిన్నదిగా చేస్తుంది. ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలను ఓటు వేయడానికి తరలి రానప్పుడు ఈ ఉదాసీనత కనిపిస్తుంది.

  చదువు గందరగోళం సృష్టిస్తుంది
  పట్టణాల్లో విద్యావంతులు ఎక్కువ. నగరాల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. మీడియా, ఇతర మార్గాల ద్వారా మరీ ఎక్కువ సమాచారం, విద్యావంతులైన పట్టణ ఓటర్ల మనస్సులను గందరగోళ పరుస్తుంది. వారు అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో విశ్వాసం కోల్పోయి పనికిరాని అభ్యర్థికి ఓటు వేయకూడదని భావిస్తారు. మరోవైపు గ్రామీణ భారతంలో ఓటర్లు ఓటు తమ జీవితంలో మార్పు తెస్తుందని నమ్ముతారు. (ఒక చిన్న ఉదాహరణ - కర్ణాటకలో గ్రామీణ మాండ్యలో 80 శాతం కంటే ఎక్కువగా పోలింగ్ నమోదైంది, పేరున్నవారు, సంపన్నులు నివసించే దక్షిణ బెంగళూరులో 27 శాతం పాయింట్లు తక్కువ ఓట్లు నమోదయ్యాయి.)

  ఓటింగ్ శాతం పెంచడానికి ప్యానల్ ఇచ్చిన సలహాలు
  • మీడియాను విస్త్రతంగా వినియోగించి ఓటర్లకు అవగాహన కల్పించాలి. ఓటుతో కొత్తదనం వస్తుందనే ఉద్దేశాన్ని ఓటర్లలో రేకెత్తించాలి.
  • ఓటు వేయడంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు గుర్తించాలి. వలస వెళ్లినప్పుడు అడ్రస్ మార్పు, ఎన్నికల జాబితాలో పేరు లేకపోవడం, ఓటరు ఐడీ కార్డు లేకపోవడంలాంటివి.
  • అమెరికా వంటి దేశాలు, ఓటు వేయని వారిని సంప్రదించి అందుకు గల కారణాలను గుర్తిస్తాయి.
  • పోలింగ్ ప్రక్రియను సౌకర్యవంతం చేయాలి. ఓటర్లు పోలింగ్ బూత్ కు చేరుకోవటానికి సౌకర్యం కల్పించడం ద్వారా వలస కార్మికులు, మహిళలు, సీనియర్ సిటిజెన్లు, మొదటిసారి ఓటర్లు పెద్దఎత్తున వస్తారు. అందుకోసం చట్టాలను సరళతరం చేయాలి.
  • నిర్బంధ ఓటింగ్ చట్టాలను ప్రవేశపెట్టి, ప్రతి అర్హతగల పౌరుని ఓటు చేయడానికి బాధ్యునిగా చేయాలి.
  • మొబైల్ యాప్స్, స్మార్ట్ ఫోన్ల ద్వారా డిజిటల్ ఓటింగ్ ప్లాట్ ఫామ్స్‌ను ప్రవేశపెట్టాలి.
  • 2030 నాటికి భారత జనాభాలో 50% మంది పట్టణ ప్రాంతాలకు తరలిపోతారని అంచనా. ప్రస్తుతం ఉన్న పట్టణ ఓటరు ఉదాసీనత కొనసాగితే ఒక భయానక పరిస్థితికి చేరుతుంది. అన్ని సాధారణ ఎన్నికలలోనూ పట్టణ ఓటర్లను భాగం చేయాలి.

  బటన్ దబావో దేశ్ బనావో అనేది, ప్రస్తుతం నడుస్తున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయెంకా గ్రూప్ ద్వారా సమర్పించబడిన ఒక నెట్వర్క్ 18 ఇనీషియేటివ్. హాష్ ట్యాగ్ #ButtonDabaoDeshBanao ఉపయోగించి సోషల్ మీడియాలో సంభాషణను అనుసరించండి.
  First published:

  Tags: Lok Sabha Election 2019, News18

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు