BUTTON DABAO DESH BANAO NEWS18 INIATIVE URGING EVERYONE TO VOTE MS
#ButtonDabaoDeshBanao : సార్వత్రిక ఎన్నికలు 2019.. మీ ఓటు మీ స్వరం..
ప్రతీకాత్మక చిత్రం
ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ మరియు నెట్ వర్క్ 18, ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలలో ఓటు వేయవలసిందిగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించటానికి ఒక ప్రచారం ప్రారంభించాయి.'న్యూస్18 ఇండియా' నుంచి ప్రతీక్ త్రివేది, ఓటు వేయడం పట్ల ప్రజల మనోభావాన్ని అనుభూతిని తెలుసుకునేందుకు ఝార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నారు.
ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ మరియు నెట్ వర్క్ 18, ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికలలో ఓటు వేయవలసిందిగా భారతదేశ వ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహించటానికి ఒక ప్రచారం ప్రారంభించాయి.'న్యూస్18 ఇండియా' నుంచి ప్రతీక్ త్రివేది, ఓటు వేయడం పట్ల ప్రజల మనోభావాన్ని అనుభూతిని తెలుసుకునేందుకు ఝార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నారు. ప్రజల మధ్య ఉత్సాహం మరియు ప్రేరణ కలిగిస్తూ అతను రాంచీ మరియు ధన్బాద్ వీధుల వెంట తిరిగారు, మరియు తప్పక వారి అమూల్యమైన ఓటును వేయవలసిందిగా వారిని ప్రోత్సహించారు.
ప్రదీప్ త్రివేది, రాంచీ మరియు ధన్బాద్లలో ప్రజలను ఇంటర్వ్యూ చేస్తూ, ఏ దేశ పౌరుడైనా తన ఓటును ఉపయోగించడం ద్వారా దేశానికి మద్దతు ఇస్తాడని సామాన్యులకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజల యొక్క, ప్రజల ద్వారా మరియు ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ప్రజలు ఓటు వేసినప్పుడు వారి ఇష్టం ఏమిటో తెలుస్తుంది. ఓటు అనేది ప్రజల యొక్క స్వరం.. ఇది ఎన్నికల సమయంలో బిగ్గరగా మరియు స్పష్టంగా వినిపించాలి.
ఓటు వేయకపోవడం వలన కలిగే సమస్యలు
మీరు ఎన్నికలలో ఓటు వేయకపోతే, ప్రభుత్వం మరియు ఎన్నికైన అధికారుల గురించి ఫిర్యాదు చేయడానికి మీరు హక్కు కోల్పోతారు.
మీ అంచనాలకు తక్కువగా ఉండే ప్రభుత్వ పాలసీలు, మీ స్వంత ఉదాసీనత మరియు ఉపేక్ష యొక్క ఫలితమే అయి ఉంటాయి.
మీ స్వంత దేశంలో మీరు స్వరం లేకుండా అయిపోయి ఒక అసమర్థమైన ప్రభుత్వం చేతిలో ఒక కీలుబొమ్మగా మారుతారు.
మీరు పాల్గొనకుండా మీ అవసరాలు మరియు కోరికలు ఎప్పటికీ అర్థం చేసుకోబడవు లేదా పరిష్కరించబడవు.
ఓటింగ్ వలన ప్రయోజనాలు
ఓటింగ్ ముఖ్యమైనది, జాగ్రత్తగా వినియోగించుకున్నప్పుడు మీ ఒక్క ఓటు, దేశంలో పెద్ద మార్పులను తీసుకురాగలదు. మంచి విద్య, మరిన్ని ఉద్యోగాలు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, మంచి పన్నుల చట్టాలు మరియు వాటి అమలు –ఇవన్నీ కూడా బాధ్యతాయుత ఓటింగ్ యొక్క ఫలితం.
పౌరుల జీవితాలను మెరుగుపర్చడం కోసం మార్పులు తీసుకురావటానికి కృషి చేసే ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకువస్తాము. ప్రతీ ఒక్క ఓటు, మంచి పరిపాలనను ప్రోత్సహిస్తుంది. దేశాన్ని వేగంగా సాధికారత దిశగా తీసుకెళ్లి పౌరుల భవిష్యత్తును సురక్షితం చేస్తుంది.
ముగింపు
ఓటింగ్ అనేది ఒక రాజ్యాంగ హక్కు మరియు ప్రతిఒక్క పౌరుని యొక్క నైతిక బాధ్యత. అందువలన ఇది గౌరవించబడాలి.
శ్రద్ధ, పరిశీలన మరియు జ్ఞానంతో ఉపయోగించబడాలి.
మనం ఓటు వేసేటప్పుడు మనం కేవలం ప్రభుత్వాన్నిఎన్నుకోవడం మాత్రమే కాక మనం మన ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క ఒక భాగం అని గుర్తుంచుకోవాలి.
మీ ఓటు మీ స్వరం – దానిని వినిపించనీయండి, బిగ్గరగా మరియు స్పష్టంగా.
ఐదో దశ ఎన్నికలలో ఝార్ఖండ్లో ఓటింగ్ జరిగింది. ఇందులో మొత్తం ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు 63.50% కాగా.. ఝార్ఖండ్లో 65.17%, ధన్బాద్లో 61.90% ఓటర్లు ఉన్నారు.
'బటన్ దబావో దేశ్ బనావో' ప్రస్తుతం వినిపిస్తున్న నినాదం. సార్వత్రిక ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్పి సంజీవ్ గోయింకా గ్రూప్ ద్వారా నెట్వర్క్ 18 ప్రారంభించిన ఇనీషియేటివ్ 'బటన్ దబావో దేశ్ బనావో'.
హాష్ ట్యాగ్ #ButtonDabaoDeshBanao ఉపయోగించి సోషల్ మీడియాలో సంభాషణను అనుసరించండి
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.