Home /News /national /

BUTTON DABAO DESH BACHAO NEWS18 INIATIVE DO VOTE MS

#ButtonDabaoDeshBanao : మీ ఓటు వెల కట్టలేనిది.. దాన్ని ఉపయోగించుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్‌పి గోయెంకా గ్రూప్ మరియు నెట్‌వర్క్ 18, ఓటింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను ప్రోత్సహించడానికి ఎన్నికలకు ముందు ఒక ఇనిషియేటివ్ ప్రారంభించింది.

  సాధారణ ఎన్నికలు-2019 పూర్తి అవడానికి మరొక దశ మాత్రమే మిగిలి ఉంది.ఓటర్లు ఓటు వేసేందుకు తరలి రావడానికి ఈ ఎన్నికల్లో కొన్ని ఆశ్చర్యకరమైన స్టాటిస్టిక్స్ వెలుగులోకి వచ్చాయి.భారతదేశంలో దాదాపుగా 9 బిలియన్ మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ దురదృష్టవశాత్తు, కొన్ని నియోజకవర్గాల్లో 40 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది.జనాభాలో మెజారిటీ ఓటర్లు వారి హక్కును ఉపయోగించుకోవట్లేదు.భారతీయ ఓటర్ల యొక్క ఈ బధ్ధకం మరియు ఉదాసీనత అనేది మొత్తంమీద పౌరులకు మరియు దేశానికి మేలు చేయదు.

  ఆర్‌పి గోయెంకా గ్రూప్ మరియు నెట్‌వర్క్ 18, ఓటింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను ప్రోత్సహించడానికి ఎన్నికలకు ముందు ఒక ఇనిషియేటివ్ ప్రారంభించింది.వారి సమిష్టి కృషి ఫలితాలు చూపించాయి. ప్రస్తుతం నడుస్తున్న సాధారణ ఎన్నికలు స్వాతంత్ర్యం నాటి నుంచి అత్యధిక సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చేవారిని చూడవచ్చు.

  ఇక్రమ్ రాజస్థాని, దిలీప్ భట్ మరియు మనీషా అగర్వాల్ వంటి ఘనమైన ప్రముఖులతో పాటు న్యూస్18 ఇండియా నుంచి అమిష్ దేవ్‌గన్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్నారు. అమిష్ ఓటు యొక్క శక్తి గురించి విస్తృతంగా చర్చించారు.

  ఎందుకు ఓటు వేయాలి?

  అమీష్ దేవగన్, పదేపదే ఓటు యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. తన వైఖరిని నిరూపించడానికి, అతను మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవడానికి అనేక కారణాలను పేర్కొన్నారు. మీ ఓటు వేయడానికి గల కారణాలు చాలా ఉన్నాయి మరియు వాటిల్లో కొన్ని కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:
  • మీ ఓటు ఎన్నికైన నాయకుల పై బాధ్యత మోపుతుంది

  • మీ ఓటు ఎన్నికైన నాయకులు వారి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చటానికి బలవంతం చేస్తుంది
  • మీ ఓటు మీ పిల్లలు మరియు భవిష్యత్తు తరాల కోసం ఒక ఉజ్జ్వల భవిష్యత్తును నిర్ధారిస్తుంది
  • మీ ఓటు మీకు అనేక హక్కులు కల్పిస్తుంది మరియు మీకు ఆ హక్కులను మంజూరు చేయటానికి ఎన్నికైన నాయకులను ఒత్తిడి చేస్తుంది
  • మీ ఓటు ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తుంది మరియు దాని ప్రజలను ఒకటిగా చేస్తుంది
  • ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో మీ ఓటు మీ మాట అవుతుంది
  • మీరు తెలివిగా మరియు జాగ్రత్తగా వినియోగించుకోవలసిన ఒక బాధ్యత మీ ఓటు
  • మీ ఓటు మంచి పరిపాలనను తీసుకు వస్తుంది
  • మీ దేశం యొక్క ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి మీ హక్కును మీ ఓటు స్థాపిస్తుంది
  • పాలక ప్రభుత్వం అనేది మీరు మీ ఓటు వేయడం ద్వారా వ్రాసిన స్క్రిప్ట్ కు ఒక ప్రతిబింబం
  • మీరు ఓటు వేయకూడదని ఎంచుకుంటే మీ ఓటు మరొకరి ద్వారా వేయబడుతుంది
  • మీరు ఓటు వేయడాన్ని తప్పించుకున్నప్పుడు మీరు ఒక బాధ్యతలేని మరియు ఉదాసీనమైన ప్రభుత్వం గురించి ఫిర్యాదు చేయడానికి మీ హక్కును కోల్పోతారు
  • మీరు మీ దేశాన్ని ప్రేమిస్తున్నట్లయితే, మీరు మీ ఓటును ఉపయోగించాలి
  • మీ ఓటు అనేది దేశానికి మీ కర్తవ్యం. దానిని తెలివిగా నిర్వహించండి
  • మీ ఓటు మీ ఆరాధన, మతం, గర్వం, బలం మరియు శక్తి
  • మీ ఓటు దేశం పట్ల మీ నైతిక బాధ్యత
  • మీ అన్ని సమస్యలకు మరియు మనోవేదనలకు సమాధానం మీ ఓటు.
  మే 6 వ తేదీన నిర్వహించిన 5 వ దశలో జైపూర్లోఎన్నికలు జరిగాయి. దశ 5 లో మొత్తం ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు 63.50% ఉంది. జైపూర్లో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు 68.14% ఉంది.
  ఓటు వేసి మీ హక్కును వినియోగించుకోండి. భారతదేశ రాజ్యాంగం ద్వారా మీకు అందజేయబడిన ఈ ప్రతిష్టాత్మకమైన మరియు అమూల్యమైన ప్రాథమిక హక్కు పట్ల ఉదాసీనంగా ఉండకండి. మీ ఓటు అందరినీ సమాన స్థాయికి తీసుకువచ్చే గొప్ప సాధనం మరియు కులం, మతం లేదా స్థితితో సంబంధం లేకుండా, ప్రతి పౌరునికి ఓటు వేసేందుకు మరియు తన ఓటు లెక్కకు వచ్చేలా చేసేందుకు హక్కు ఉంటుంది. ఓటరు నుండి ఈ హక్కును ఎవరూ లాగివేయలేరు లేదా తొలగించలేరు.
  బటన్ దబావొ దేశ్ బనావో అనేది, ప్రస్తుతం నడుస్తున్న భారతీయ సాధారణ ఎన్నికల్లో, ఓటు వేయవలసిందిగా ప్రతి భారతీయుని అభ్యర్ధిస్తూ, ఆర్ పి సంజీవ్ గోయింకా గ్రూప్ ద్వారా సమర్పించబడిన ఒక నెట్వర్క్ 18 ఇనీషియేటివ్. హాష్ ట్యాగ్ #ButtonDabaoDeshBanao ఉపయోగించి సోషల్ మీడియాలో సంభాషణను అనుసరించండి
  First published:

  Tags: Lok Sabha Election 2019, Vote

  తదుపరి వార్తలు