Buta Singh passes away: మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ అస్తమయం

మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ అస్తమయం (file image - credit - twitter - Srinivas B V)

Buta Singh passes away: ఇప్పటి తరం వారికి బూటాసింగ్ పెద్దగా తెలియకపోవచ్చు. ఒకప్పటి నేతలకు ఆయన సుపరిచితం. ఆయన మరణం తీరని లోటే.

  • Share this:
    Buta Singh passes away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ నేత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. "బూటా సింగ్ జీ... ఎంతో అనుభవం ఉన్న పాలనాదక్షుడు. పేదలు, కష్టాల్లో ఉన్నవారి తరపున ప్రభావవంతంగా తన గళం వినిపించేవారు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం శోచనీయం. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతు దారులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో తెలిపారు.


    కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఈ దేశం ఎంతో గౌరవనీయమైన ప్రజా సేవకుణ్ని కోల్పోయింది అని అన్నారు. "బూటా సింగ్ జీ అస్తమయం ద్వారా ఈ దేశం ఓ గొన్న నాయకుణ్ని, ప్రజా సేవకుణ్ని కోల్పోయింది. ఆయన తన జీవితాంతం ప్రజా సేవకే అంకితమయ్యారు. ప్రజల కోసం పాటుపడ్డారు. ప్రజలు ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ విషాద పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను" అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


    బూటా సింగ్ తొలిసారిగా అకాళీదళ్ సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన... 1960లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. 1962లో మూడో లోక్‌సభకు ఆయన సుధ్నా నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూర్ కాస్ట్‌కి 2007-2010 మధ్య అధ్యక్షుడిగా కూడా చేశారు.





    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ 5 రాశుల వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు... లైఫ్ అంటే వీరిదే...

    పంజాబీ సంస్కృతిపై ఆయన చాలా ఆర్టికల్స్ రాశారు. సిక్కుల చరిత్రపైనా రాసిన ప్రతులున్నాయి. పంజాబీ స్పీకింగ్ స్టేట్ (విమర్శనాత్మక కోణంలో) పేరుతో ఆయన ఓ పుస్తకం కూడా రాశారు. అలాంటి ఆయన చనిపోవడంతో... కాంగ్రెస్ నేతలు, మద్దతుదారులు, కార్యకర్తలు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: