ఇమ్రాన్ ఖాన్‌ వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్ర సెటైర్.. దేవుడా బతికించావ్ అంటూ..

Imran Khan | Anand Mahindra | ఇమ్రాన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘దేవుడా! నీకు కృతజ్ఞతలు. ఈ వ్యక్తి మాకు చరిత్ర, జాగ్రఫీ టీచర్ కాకుండా చూశావ్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 26, 2019, 10:01 AM IST
ఇమ్రాన్ ఖాన్‌ వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్ర సెటైర్.. దేవుడా బతికించావ్ అంటూ..
ఇమ్రాన్ ఖాన్, ఆనంద్ మహీంద్రా
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 26, 2019, 10:01 AM IST
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌‌‌పై బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా ట్రోల్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మొదట్లో ఇరాన్ పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్.. అక్కడి సమావేశంలో మాట్లాడుతూ జర్మనీ, జపాన్ పక్కపక్కనే ఉంటాయని, సరిహద్దులు పంచుకుంటున్న రెండు దేశాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం పరిశ్రమలతో అభివృద్ధి చెందాయని చెప్పారు. దీనిపై అప్పట్లో నెటిజన్లు ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కలు చూపించారు. రెండు దేశాల సరిహద్దులు కలుసుకోవని, వీటి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుందని.. ప్రధానిగా ఉన్న మీకు అది కూడా తెలీదా? అని కామెంట్లు పెట్టారు. పైగా, జపాన్‌తో ఏ దేశానికి సరిహద్దులు లేవని.. చుట్టూ సముద్రం ఉంటుందని గట్టిగానే స్పందించారు.

అయితే, తాజాగా.. ఇమ్రాన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘దేవుడా! నీకు కృతజ్ఞతలు. ఈ వ్యక్తి మాకు చరిత్ర, జాగ్రఫీ టీచర్ కాకుండా చూశావ్’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. దీంతో ఆయన ట్వీట్‌కు క్షణాల్లోనే రీట్వీట్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.


First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...