హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Business Idea: కిలోకు రూ.500.. ఎర్ర బెండతో రైతుల జీవితం మారినట్లే.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం!

Business Idea: కిలోకు రూ.500.. ఎర్ర బెండతో రైతుల జీవితం మారినట్లే.. ఎకరాకు రూ.10 లక్షల ఆదాయం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: ఎర్రబెండలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల వల్లే మార్కెట్‌లో మంచి రేటు లభిస్తుంది. కిలోకు రూ.500 వరకు విక్రయిస్తారు. ఒక్కోసారి రూ.800 వరకు కూడా వెళ్తుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మన దేశంలో ఎక్కువ మంది రైతులు సంప్రదాయ పంటలే  (Agriculture)పండిస్తారు. కూరగాయలతో పాటు పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, వరి, మిర్చి, గోధుమ పంటలకే ప్రాధాన్యత ఇస్తారు. వీటికి ఒక్కోసారి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతుంటారు. కానీ మార్కెట్‌లో అధిక ధర లభించే వాణిజ్య పంటలను (Business Ideas) పండిస్తే..భారీగా లాభాలుంటాయి. నలుగురు పండించే పంటలు కాకుండా.. విభిన్న మార్గంలో వెళ్తే లక్షాధికారులు కావచ్చు. మార్కెట్‌లో అధిక ధర లభిస్తున్న పంటల్లో ఎర్ర బెండ (Red ladyfinger  Farming) కూడా ఉంది. మనదేశంలో ఎక్కువగా పచ్చ బెండకాయ కనిపిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. రైతులు ఎర్ర బెండ సాగుకు మొగ్గుచూపుతున్నారు. సాధారణ బెండతో పోల్చితో రెడ్ లేడీస్ ఫింగర్‌తో అధిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అంతేకాదు దీని ధర కూడా సాధారణ బెండతో పోల్చితే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది.

  Business Ideas: ఈ పండును సాగుచేస్తే రైతులకు డబ్బే డబ్బు.. లక్షల్లో ఆదాయం

  ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి(Varanasi)లో ఉన్న ఇండియన్ వెజిటెబుల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో (Indian Vegetable Research Institute) మొదట ఎర్ర బెండను సాగుచేశారు. అందువల్ల దీనిని కాశీ బెండ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దేశమంతటా దీని విత్తనాలు లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. ప్రస్తుతం యూపీతో పాటు మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర , గుజరాత్ , హర్యాణా, ఢిల్లీ రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. ఎర్ర బెండ పంటను సంవత్సరానికి రెండు సార్లు పండించవచ్చు. ఫిబ్రవరి-మార్చి, జూన్-జులై సమయం ఎర్రబెండ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఇసుకలతో కూడిన నేలల్లో ఇవి బాగా పండుతాయి. దీని సాగు కూడా సాధారణ బెండ మాదిరిగానే ఉంటుంది. రోజుకు 5-6 గంటల సూర్యకాంతి ఉంటే సరిపోతుంది. ఎర్ర బెండ 7 అంగుళాల వరకు పెరుగుతుంది. 45-50 రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది. ఒక ఎకరా నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

  ఎర్ర బెండలో ఆంథోసిన్ ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందించడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఫైబర్, ఐరన్‌తో పాటు యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఐతే దీనిని సాధారణ బెండలా కూర వండుకొని తినేబదులు.. సలాడ్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాల వల్లే మార్కెట్‌లో మంచి రేటు లభిస్తుంది. కిలోకు రూ.500 వరకు విక్రయిస్తారు. ఒక్కోసారి రూ.800 వరకు కూడా వెళ్తుంది. కిలోకు రూ.500 చొప్పున.. క్వింటాల్‌కు రూ.50వేలు వస్తాయి. ఈ లెక్కన ఒక ఎకరా పొలం ఉంటే... 20 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. రెండు మూడు సమయంలోనే రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. నగరాలకు తీసుకెళ్లి సూపర్ మార్కెట్‌లతో ఒప్పందం చేసేకుంటే అధిక లాభాలు వస్తాయి. మీ సమీపంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి వెళ్తి.. ఎర్ర బెండ విత్తనాలు, సాగు విధానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ పంటలను పండించే ముందు లేదా వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas, Farmers

  ఉత్తమ కథలు