16 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలో మాయావతి..!

2003లో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకూడదని మాయావతి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర శాసన మండలి, రాజ్యసభకు మాత్రమే ఎన్నికవుతూ వస్తున్నారు.

news18-telugu
Updated: July 11, 2018, 3:50 PM IST
16 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలో మాయావతి..!
బీఎస్పీ అధినేత్రి మాయావతి (ఫైల్ ఫొటో)
  • Share this:
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ టార్గెట్‌గా వ్యూహాలకు పదునుబెడుతున్నారు బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం.. ఆమెకు మరింత బూస్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే 16 ఏళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని మాయావతి యోచిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ కంచు కోట,  తనకు బాగా కలిసివచ్చిన అంబేద్కర్ నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకే మాయావతి..ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ లోక్‌సభ  ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమి... బీజేపీని చిత్తుగా ఓడించింది. అదే స్ట్రాటజీతో వచ్చే ఎన్నికల్లో కమలదళాన్ని మట్టికరిపించడమే లక్ష్యంగా మాయావతి వ్యూహాలకు పదునుబెట్టారు. ఈ క్రమంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఐతే ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై ఆమె కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అంబేద్కర్‌నగర్, బిజ్నోర్ స్థానాలు ఆమె పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాయావతి అంబేద్కర్‌నగర్ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అటు యూపీలో రెండు రోజుల పాటు పర్యటించిన అమిత్ షా.. ఎస్పీ-బీఎస్పీ ఎన్నికల వ్యూహంపై ఫోకస్ పెట్టాలని అక్కడి నేతలకు సూచించారు. వారికి కదలికలకు అనుగుణంగా ప్రతి వ్యూహాలను సిద్ధం చేయాలని తెలిపారు.


కాగా, 2003లో బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకూడదని మాయావతి నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర శాసన మండలి, రాజ్యసభకు మాత్రమే ఎన్నికవుతూ వస్తున్నారు. 2007లో యూపీలో బీఎస్పీ అధికారంలోకి రావడంతో ఆమె మండలిలో అడుగుపెట్టి సీఎంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2012లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  గత ఏడాది జులై వరకు రాజ్యసభలో కొనసాగిన ఆమె... అనంతరం పదవిని వదిలిపెట్టారు.
Published by: Shiva Kumar Addula
First published: July 11, 2018, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading