హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Biryani Free Offer: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. రెండు కేజీల బిర్యానీ తింటే టమాటో ఫ్రీ.. కానీ ఓ కండిషన్

Biryani Free Offer: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. రెండు కేజీల బిర్యానీ తింటే టమాటో ఫ్రీ.. కానీ ఓ కండిషన్

బిర్యానీ కొంటే టమాటో ఫ్రీ

బిర్యానీ కొంటే టమాటో ఫ్రీ

Biryani Free Offer: బిర్యానీ పేరు చెప్పగానే చాలామందికి నోరు ఊరుతుంది. ముఖ్యంగా బయట మంచి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తినాలి అని చాలామందికి ఉంటుంది. కానీ అక్కడి వేసే బిల్లు గుర్తుకు వస్తే.. కోరికను వాయిదా వేసుకుంటూ ఉంటారు. కానీ బిర్యానీ లవర్స్ కు ఓ హోటల్ బంపర్ ఆఫర్ పెట్టింది. బిర్యానీ ఫ్రీ అంటూ ప్రకటన చేసింది. కానీ ఓ కండిషన్ పెట్టింది..

ఇంకా చదవండి ...

Biryani Free Offer:  గుమ గుమలాడే బిర్యానీ (Biryani) వాసన చూస్తే నోరు ఊరడం ఖాయం.. లొట్టలేసుకుని బిర్యానీని ఆరగించాలి అనుకుంటారు భోజన ప్రియులు (food lovers).. కానీ మంచి రెస్టారెంట్ (restaurant) కు వెళ్లి కడుపారా బిర్యానీ తినాలి అంటే బిల్లు వాచిపోతుంది. ఆ భయంతో కోరికలను మనుసలోనే అదుపు చేసుకుంటారు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు.. కానీ అలా కోరికలను అదుపు చేసుకుంటున్న బిర్యానీ లవర్స్ కు ఒక శుభవార్త.. ఆహా ఏమి రుచి అనుకునేలా పసందైన.. రుచికరమైన వేడి వేడి వంటకాన్ని.. ఏ బిర్యానీ కావాలంటే ఆ బిర్యానీని ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటించింది ఓ బిర్యానీ సెంటర్ (Biryani Center).. అలా అనుకుని చేతులు ఊపుకొని వెళ్తే కుదరదు.. ఎందుకంటే ఆ హోటల్ యజమాని ఓ కండిషన్ పెట్టారు. బిర్యానీ కోసం వచ్చే వారు కిలో టమాటో (Kg Tomato) లు వెంట తీసుకువచ్చి ఇవ్వాలంటూ మెలిక పెట్టారు. అంతే కాదు.. ఒక వేళ ఎవరైనా రెండు ప్లేట్ల బిర్యానీ తీసుకుంటే.. అరకిలో టమాటో ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో ఆ బిర్యానీ సెంటర్ ఇప్పుడు ఫేమస్ అయ్యింది.

టమాటో బయట మార్కెట్ లో దొరకడం లేదు.. దీంతో అక్కడికి వెళ్లి బిర్యానీ ఆరగిస్తున్నారు. అరకిలో టమాటో ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. అయితే ఫ్రీ బిర్యానీ మాత్రం కుదరడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టమాటోలు దొరకడం గగనమైంది. చికెన్ రేట్లతో టమాటో పోటీ పడుతుంది. పెద్ద పెద్ద మార్కెట్లలో సైతం.. 150కు చేరువు అవుతోంది కిలో టమాటో ధర..

ఇదీ చదవండి: షాకింగ్ కార్ యాక్సిడెంట్.. ఇప్పటి వరకు ఇలాంటిది చూసి ఉండరేమో.. ఆరు వాహనాలపై ఎఫెక్ట్..

టమాటో ధర సంగతి ఎలా ఉన్నా.. కొంతమంది భోజన ప్రియులకు మాత్రం ఈ ఆఫర్ తెగ నచ్చింది. దీంతో బిర్యానీ లవర్స్ అక్కడకు క్యూ కడుతున్నారు. బిర్యానీ సెంటర్‌కు భారీగా గిరాకీ పెరిగింది. అయితే ఈ ఆఫర్ మన దగ్గర కాదండోయ్.. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఓ హోటల్ యజమాని ఇలా బోర్డు పెట్టి.. తన బిజినెస్ ను పెంచుకుంటున్నారు. చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వహకులు ఇచ్చిన స్పెషల్ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ మారింది. 

ఇదీ చదవండి: చీర కట్టులో చిల్ అవుతున్న మహానటి.. కుర్రాలను కైపెక్కిస్తున్న లేటస్ట్ పిక్స్

ఈ ఆఫర్ పెట్టడానికి అసలు కారణం ఏంటంటే... ప్రస్తుతం చెన్నైలో కిలో టమాటో ధర 150 రూపాయలకు పైగానే ఉంది. అది కూడా మార్కెట్ లో టమాటో దొరకడం కూడా కష్టంగా మారింది. రేట్లు పెరగడంతో నిల్వ చేసుకుంటున్నారు తప్ప అమ్మడానికి ముందుకు రావడం లేదు. దీంతో చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం ప్రాపర్టీలో.. అంబూర్ బిర్యానీ షాప్ యజమాని తన సేల్స్ పెంచుకోవడం కోసం ఈ ఆఫర్ పెట్టాడు. కిలో టమాటో తెచ్చిన వారిక ఫ్రీగా బిర్యానీ ఇస్తున్నారు.

ఇదీ చదవండి:మాజీ మిస్‌ కేరళ మృతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు.. హోటల్ సీసీ ఫుటేజ్ ఏమైంది?

అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక ప్లేట్ బిర్యానీ వంద రూపాయిలు, ఎవరైనా రెండు కేజీల బిర్యానీ కొంటే వారికి అరకిలో టమాటాలు ఫ్రీగా ఇస్తామని ఆఫర్ చేశారు. లేదంటే, ఒక కేజీ టమాటోలు తీసుకుని వచ్చి ఇస్తే.. ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ఇవ్వడంతో జనం తండోపతండాలు వస్తున్నారు. దీంతో గిరాకీ పెరిగింది. తను అనుకున్నది సక్సెస్ అవ్వడంతో షాపు యాజమాని తెగ మురిసిపోతున్నాడు.

First published:

Tags: Biryani, Chennai, Food, Tamilnadu, Tomatoes

ఉత్తమ కథలు