బెంగళూరులో కూలిన భవనం... కార్మికుడు మృతి

మూడో అంతస్తులో ఏడుగురు కార్మికులు కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారని..వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

news18-telugu
Updated: July 10, 2019, 8:30 AM IST
బెంగళూరులో కూలిన భవనం... కార్మికుడు మృతి
బెంగళూరులో కూలిన భవనం(ఏఎన్ఐ ట్విట్టర్)
  • Share this:
బెంగళూరులో ప్రమాదం చోటు చేసుకుంది. పులకేశి నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. బుధవారం తెల్లవారుజామున  జరిగిన ఈ ఘటనలో బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు మృతిచెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

ఇప్పటి వరకు శిథిలాల కింద చిక్కుకున్న ఎనిమిదిమందిని బయటకు తీశారు.  క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడో అంతస్తులో ఏడుగురు కార్మికులు కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నారని..వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కార్మికులంతా ఉత్తరాదికి చెందిన వలసకూీలని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు