GT Hemanth Kumar, Tirupathi, News18
మాతృప్రేమ (Mother) ఎంతో గొప్పది. అందుకే తల్లిని మించిన దైవం లేదని అంటారు పెద్దలు. తల్లి చూపించే ఆప్యాయత అనురాగం మరెవ్వరు చూపలేరు. కటిక పేద వాడి నుంచి అపర కుబేరుడైన కోటీశ్వరుని వరకు వెలకట్టి కొనలేది ఏమైనా ఉందంటే అది తల్లి ప్రేమే. ఇందుకు భూమిపై నివసించే చిన్న చిన్న జీవరాసులు, పక్షుల నుంచి మనషుల వరకు తల్లి ప్రేమకు దాసులే. అమ్మను వీడిచిపెట్టి బిడ్డలు ఉంటారేమో గాని బిడ్డలకు దూరంగా ఏ తల్లి ఉండలేదు. కన్న ప్రేమ దూరం చేయదు. తాజాగా చెన్నై (Chennai) లో జరిగిన ఓ ఘటన ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోమీటర్ల మేర బైక్ వెంట పరుగులు తీసింది ఓ గేదే. అసలు ఎందుకు జరిగిందో ఎందుకు అలా వెళుతుందో దారిలో పోయే వారికీ ఏమి అర్థం కావడం లేదు. అలా అని ఆ గేదెను తాడుతో లాక్కొని వెళ్తున్నారా అంటే అది కూడా కాదు. అసలు కథ ఏంటంటే..?
చెన్నై పోరూరిలో నివాసముంటున్న ప్రసాద్ అనే వ్యక్తి గేదె పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. తనకు ఉన్న రెండు గేదెలను ఇంటికి మూడు కిలో మీటర్ల దూరం మేతకు తీసుకెళ్తు ఉంటాడు. అందులో ఓ గేదె గర్భంతో ఉంది. రేపో మాపో ఓ దూడకు జన్మనిచ్చేనందుకు సిద్ధంగా ఉంది. రోజులాగే గేదెను మేతకు తీసుకెళ్లాడు యజమాని ప్రసాద్. కొంతసేపటికి గెదే బాగా అరవడం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన ప్రసాద్.., దూడకు జన్మనివబోతుందని గ్రహించాడు. గేదె సురక్షితంగా దూడకు జన్మనిచ్చేలా చూసుకున్నాడు.
తన బిడ్డను చూడగానే గేదె ఆ లేగదూడను శుభ్రం చేసింది. దూడ అక్కడే ఉంటే ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉండటంతో ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మరొకరి సాయంతో దూడను తీసుకొని బైక్ పై ఇంటికి బయలుదేరాడు. అప్పుడే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తన బిడ్డను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారని తల్లడిల్లిపోయిన గేదె.. ఆ బైక్ వెనుకై మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీసింది. తన బుజ్జాయి పడిపోతుందేమోనని కంగారుగా పరుగులు పెట్టింది. ఇంటికెళ్లిన తర్వాత తన బిడ్డకు పాలిచ్చి తన ప్రేమను చాటుకుంది.
లేగదూడ కోసం గేదె పరుగులు పెట్టిన తీరు ప్రతిక్కరినీ కదిలించింది. ఓ వ్యక్తి ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. జాతి ఏదైనా తల్లిప్రేమ తల్లిప్రేమే అని ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.