Home /News /national /

Viral Video: నడిరోడ్డుపై గేదెతో టీచర్ల నిరసన.. కానీ అంతలోనే ఊహించని పరిణామం..

Viral Video: నడిరోడ్డుపై గేదెతో టీచర్ల నిరసన.. కానీ అంతలోనే ఊహించని పరిణామం..

గేదెతో టీచర్ల నిరసన (Image:Twitter)

గేదెతో టీచర్ల నిరసన (Image:Twitter)

నిరసనకారులు గేదె చుట్టూ చేరి హడావిడి చేయడం, ఫొటోలు దిగేందుకు పోటీపడడంతో.. దానికి చిర్రెత్తుకొచ్చింది. వారి నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో విధ్వంసం సృష్టించింది.

    ఏదైనా అంశం గురించి రొటీన్‌గా నిరసన చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే కాస్త వినూత్నంగా చేస్తే.. అందరి దృష్టి పడుతుంది. మీడియాలో కవరేజీ వస్తుంది. అచ్చం ఇలానే ఆలోచించి మధ్యప్రదేశ్‌లో ప్రైవేట్ ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. ఓ గేదెతో నడిరోడ్డుపై నిరసననకు దిగారు. కానీ అంతలోనూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ గేదె రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసింది. కొమ్ములతో కుమ్మేయడంతో నిరసనకారులకు గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.... కరోనా కారణంగా గత ఏడాది మార్చి నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుులు ఇంటికే పరిమితమయ్యారు. గవర్నమెంట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవక అల్లాడిపోతున్నారు. ఐతే ప్రస్తుతం కరోనా తగ్గిపోవడంతో స్కూళ్లను తెరవాలని ప్రైవేట్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.

    కరోనా తగ్గుముం పట్టడంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు శనిారం షాజపూర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. వినూత్నంగా ఉంటుందని ఓ గేదెను తీసుకొచ్చారు. ఐతే నిరసనకారులు గేదె చుట్టూ చేరి హడావిడి చేయడం, ఫొటోలు దిగేందుకు పోటీపడడంతో.. దానికి చిర్రెత్తుకొచ్చింది. వారి నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో విధ్వంసం సృష్టించింది. ఓ మహిళపైకి దూసుకెళ్లడంతో ఆమెకు గాయాయ్యాయి. దాని యజమాని వచ్చి తాడును పట్టుకోవడంతో ఎట్టకేలకు శాంతించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



    గేదెను అక్కడి నుంచి తరలించిన తర్వాత ప్రైవేట్ టీచర్లు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కరోనాతో తాము ఆర్థికంగా చితికిపోయామని.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. వెంటనే స్కూళ్లను పున: ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతీ పత్రాన్ని సమర్పించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Madhya pradesh, Viral Video

    తదుపరి వార్తలు