హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Union Budget 2021: బడ్జెట్ ట్యాబ్ తో నిర్మలమ్మతో కలిసి పార్లమెంట్ కు వెళ్తూ.. సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

Union Budget 2021: బడ్జెట్ ట్యాబ్ తో నిర్మలమ్మతో కలిసి పార్లమెంట్ కు వెళ్తూ.. సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్ (Union Budget 2021) అన్ని రంగాలను ఊరిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో నిర్మలమ్మ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ పై ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...

  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్ది సేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ గురించి దేశమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత అంచనాలు ఈ బడ్జెట్ పై ఉన్నాయి. కరోనా మహమ్మారి వలన దాదాపుగా అన్ని రంగాలు కూడా కకావిలకం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 గంటల సమయంలో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సారి వినూత్నంగా పేపర్ లెస్ బడ్జెట్ పార్లమెంట్ లో ఆవిష్కృతం కానుంది. కరోనా కారణంగా ఆన్ లైన్ లోనే బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ సభ్యులకు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే బడ్జెట్ కాపీలు ఉన్న ఎర్రటి వస్త్రం చుట్టిన ట్యాబ్ తో సహా నిర్మలమ్మ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.

  కాగా, బడ్జెట్ సమావేశాలకు వస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ఎలా ఉండబోతోందన్నది తెలియజేశారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి పార్లమెంట్ భవన్ ముందు మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, కొన్ని కీలక విషయాలను మాట్లాడారు. ’ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్ ఉంటుంది. సామాన్య ప్రజల అంచనాలను చేరుకుంటుంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్‘ అన్న సూత్రాన్ని పాటించాం. కరోనా మహమ్మారి నుంచి అన్ని రంగాలు కోలుకునేలా బడ్జెట్ ఉంటుంది. ఆర్థిక రంగం తిరిగి పుంజుకుంటుంది. మీరే చూస్తారు కదా‘ అంటూ అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.

  ఇదిలా ఉండగా, నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక బ్రిటిష్‌ రాచరిక సంప్రదాయాలను పక్కనపెట్టారు. సూట్‌కేస్‌లో బడ్జెట్‌ ప్రసంగ ప్రతులను తీసుకువచ్చే విధానానికి స్వస్తి చెప్పి.. ఎరుపురంగు వస్త్రంలో బహీఖాతా రూపంలో బడ్జెట్‌ ప్రతులను తీసుకొచ్చారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఐ ప్యాడ్ తో పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. కరోనా కారణంగా పేపర్ లెస్ బడ్జెట్ ను తొలిసారి ప్రవేశపెడుతున్నారు.

  First published:

  Tags: Budget 2021, Indian parliament, Narendra modi, Nirmala sitharaman, Union Budget 2021

  ఉత్తమ కథలు