జనవరి 31 నుంచీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఈసారి ప్రత్యేకతలివీ...

Parliament Budget Session 2020 : బడ్జెట్ సమావేశాల్లో తొలి విడతను జనవరి 31 నుంచీ ఫిబ్రవరి 11 వరకూ... రెండో విడతను మార్చి 2 నుంచీ ఏప్రిల్ 3 వరకూ నిర్వహించబోతున్నారు.

news18-telugu
Updated: January 9, 2020, 11:05 AM IST
జనవరి 31 నుంచీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఈసారి ప్రత్యేకతలివీ...
నిర్మలా సీతారామన్
  • Share this:
Parliament Budget Session 2020 : దేశ ఆర్థిక పరిస్థితి రాన్రానూ దిగజారుతున్న సమయంలో... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్ని రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఒప్పుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... రెండు సభలనూ ఒప్పించారు. ఆ ప్రకారం... బడ్జెట్ సమావేశాల్లో తొలి విడతను జనవరి 31 నుంచీ ఫిబ్రవరి 11 వరకూ... రెండో విడతను మార్చి 2 నుంచీ ఏప్రిల్ 3 వరకూ నిర్వహించబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్... తన రెండో సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఐతే... ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా సాగే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌరసత్వ చట్టం నిరసనలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాయి. దానికి తోడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా బాలేదు. GDP వృద్ధి రేటు పడిపోతోంది. ధరలు పెరుగుతున్నాయి. ఆటోమొబైల్ సెక్టార్ మూలనపడింది. సంక్షేమ అంచనాలు అదుపు తప్పాయి. అందువల్ల ప్రభుత్వాన్ని ఎలాగైనా ప్రశ్నిస్తామని ప్రతిపక్షాలు పట్టుదలగా ఉన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అంత సమర్థంగా చెయ్యలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. ఓవైపు ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంటే, మందగమనంలోకి జారుకుంటుంటే... సీతారామన్ ఏమీ చెయ్యలేక... ప్రతిపక్షాలపై మండిపడుతున్నారన్న విమర్శలున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5 శాతం ఉండొచ్చని తెలుస్తోంది. అంటే... పదేళ్లలో ఇదే అతి తక్కువ. దీన్ని పరుగులు పెట్టించడానికి సీతారామన్ కొన్ని ప్రయత్నాలు చేశారు. ఎగుమతులను ప్రోత్సహించారు. హౌసింగ్ ఇండస్ట్రీకి ఊతమిచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించారు. అలాగే... కొత్త తయారీ కంపెనీలకు, టాక్స్ బెనెఫిట్స్ లేని వ్యాపారలు... కార్పొరేట్ టాక్స్ రేట్‌ను తగ్గించారు. వివిధ పరిశ్రమల వర్గాలతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూనే ఉన్నారు. ఎన్ని చేసినా... పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు. అందుకే... ఈ బడ్జెట్‌లో చాలా ఉపశమనాలు, ప్రయోజనాలు, వెసులుబాట్లు, కన్సెషన్స్, రాయితీల వంటివి కల్పిస్తారనే అంచనాలు బాగా ఉన్నాయి.
Published by: Krishna Kumar N
First published: January 9, 2020, 11:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading