Budget Halwa ceremony: ప్రతి సంవత్సరం బడ్జెట్‌కి ముందు హల్వా వేడుక జరపడం ఆనవాయితీ. ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ హల్వా వేడుక నిర్వహించబోతున్నారు. నార్త్ బ్లాక్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్, ఆర్థిక శాఖ సెక్రెటరీ, ఇతర అధికారులు పాల్గొంటారు. నిజానికి ఈ కార్యక్రమం ఈసారి జరపాలా వద్దా అనే డౌట్ మొన్నటి దాకా ఉంది. కరోనా కారణంగా బడ్జెట్లో చాలా మార్పులు చేశారు. ఈసారి బడ్జెట్ ప్రతులు ప్రింట్ చేయలేదు. అందువల్ల హల్వా వేడుక ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా కేసులు బాగా తగ్గడంతో... ఈ వేడుకను ఇవాళ జరపాలని డిసైడ్ అయ్యారు.
ఎందుకీ వేడుక:
బడ్జెట్ అనేది ఈ దేశంలోని ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే అంశం. హల్వా వేడుక ద్వారా... ఆర్థిక అంశాలను చెప్పే ముందు... నోరు తీపి చేసినట్లవుతుందని ఇలా చేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడనికి 10 రోజుల ముందు ఈ హల్వా వేడుక జరుపుతారు. ఈ వేడుకతో బడ్జెట్ ప్రక్రియ మొదలైనట్లుగా భావిస్తారు. ఈ వేడుక తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులు 10 రోజులపాటూ నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారికి ఇతర అధికారులతో, బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. ఫోన్ కాల్స్ కూడా చేయడానికి వీలు ఉండదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే వారు తమ ఇళ్లకు వెళ్తారు. అందువల్ల ఈ హల్వా వేడుక అనేది అత్యంత కీలకమైనదిగా భావిస్తారు.
అంతా రహస్యమే:
బడ్జెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎంతో మంది రకరకాలుగా ప్రయత్నిస్తారు. కొంత మంది లాబీయింగ్ యత్నాలు కూడా చేస్తారు. కానీ... కేంద్ర ప్రభుత్వాలు ప్రతిసారీ బడ్జెట్ తయారీ ప్రక్రియను అత్యంత సీక్రెట్‌గా నిర్వహిస్తాయి. ముందుగా ఏ విషయం బయటకు తెలిసినా... దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు ఫలానా వస్తువుల రేట్లు పెరుగుతాయి అని ముందే తెలిస్తే... ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుగానే వాటిని కొనుక్కుంటారు. అది ఆర్థిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇలా అధికారులను నార్త్ బ్లాక్‌లోనే ఉంచి... పూర్తి రహస్యంగా బడ్జెట్ తయారీ చేపడుతుంది.
ఇది కూడా చదవండి:Halwa: గోధుమ పిండి హల్వా... ఇలా తయారుచేసుకోండి.
ఈసారి ఇలా:
ఈసారి జనవరి 29న ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. దీన్ని కూడా ముద్రించలేదు. అంతా ఆన్లైనే. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మంగళవారం లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా బడ్జెట్ సమావేశాల్ని ప్రారంభిస్తారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకూ తొలి దశ ఉంటుంది. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో దశ ఉంటుంది. రోజూ రాజ్యసభ ఉదయం 9కి మొదలై మధ్యాహ్నం 2 వరకూ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 9 వరకూ లోక్‌సభ ఉంటుంది. అందులో జీరో అవర్, క్వశ్చన్ అవర్ కూడా ఉంటాయి. ఎంపీలంతా సమావేశాలకు హాజరయ్యే ముందే కరోనా లేదు అని నిరూపించే RT-PCR టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.
Published by:Krishna Kumar N
First published:January 23, 2021, 10:16 IST