Budget 2021 Live Updates: ఆరోగ్యం, మౌలిక వసతులు, పెట్టుబడుల ఉపసంహరణపై బడ్జెట్ ఫోకస్.. ఇన్ కం ట్యాక్స్‌పై ఉద్యోగులకు నిరాశ
Budget 2021 Live Updates - Nirmala Sitharaman:కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వార్షిక బడ్జెట్ 2021- 22 ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఆరోగ్య రంగం కోసం కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. ఆత్మనిర్భర ఆరోగ్య పథకానికి రూ. 2,23,486 కోట్లు., రక్షిత మంచినీటి పథకానికి రూ.87,000 కోట్లు, స్వచ్ఛభారత్ అర్బన్ పథకానికి రూ. 141679 కోట్లు ప్రతిపాదించింది.
వివిధ మంత్రిత్వ శాఖలకు బడ్జెట్లో కేటాయింపుల వివరాలు
14:4 (IST)
కేంద్ర రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు
కేంద్ర హోం శాఖకు రూ.1,66,546.94 కోట్లు
14:2 (IST)
75 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఊరట
Union Budget 2021 Live Updates: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ 2021- 22 ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ఆరోగ్య రంగం కోసం కేంద్రం కొత్త పథకం తీసుకొచ్చింది. ఆత్మనిర్భర ఆరోగ్య పథకానికి రూ. 2,23,486 కోట్లు, రక్షిత మంచినీటి పథకానికి రూ.87,000 కోట్లు, స్వచ్ఛభారత్ అర్బన్ పథకానికి రూ. 141679 కోట్లు ప్రతిపాదించింది. అలాగే, కరోనా వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లు కేటాయించింది. దేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గెయిల్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైప్ లైన్లలో పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయిం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. 1938 బీమా చట్టానికి సవరణ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇన్సూరెన్స్ కంపెనీల్లో FDI పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు. ఈ ఏడాదిలోనే LIC IPO ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సారి కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు ఆదాయ పన్ను విషయంలో నిరాశే ఎదురైంది. పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. కేవలం 75 సంవత్సరాలు పైబడిన వారు కేవలం పెన్షన్, వడ్డీఆదాయంపై జీవించే వారికి మాత్రం పన్ను చెల్లింపుల నుంచి మినహాయింపు ఇస్తూ బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేసింది. తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను కేటాయించారు. కేరళలో దాదాపు 1100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65వేల కోట్లను కేటాయించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా 6700 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 25వేల కోట్ల రూపాయలను వీటికి కేటాయించారు. 19వేల కోట్ల రూపాయలతో అసోంలో రహదారుల నిర్మాణం జరుగనుంది.
భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించకపోయి ఉంటే కరోనా కారణంగా తీవ్ర నష్టం వాటిల్లి ఉండేదని నిర్మలా సీతారామన్ అన్నారు. అత్యవసర రంగంలో పనిచేసేన వారంతా ప్రాణాలు ఒడ్డి సేవ చేశారని కొనియాడారు. విద్యుత్, వైద్య రంగం, బ్యాంకింగ్, అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలు ఒడ్డి పనిచేశారని వారిని అభినందించారు.‘భారత ప్రభుత్వం కరోనాకు రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చింది. మరో రెండు వ్యాక్సిన్లు రానున్నాయి. భారత ప్రజలకే కాకుండా 100 దేశాలకు భారత్ కరోనా వ్యాక్సిన్ అందిస్తోంది. కరోనా కట్టడిలో ప్రపంచానికి దిక్సూచిగా మారాం. ఆర్థిక వ్యవస్థ చరిత్రలో మూడుసార్లు మాత్రమే జీడీపీ మైనస్‌లో ఉంది. 2021 సంవత్సరం భారత్‌కు అనేక అంశాల్లో మైలురాయిగా నిలవనుంది. ఆత్మనిర్భర్ భారత్ అనేది ఇండియా కొత్త ఆలోచన కాదు.’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
2021లో కొత్తగా 9 బీఎస్ఎల్ 3 స్థాయి ప్రయోగ శాలలు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పనున్నారు. ఇక తుక్కు వాహనాల రద్దు, అధునాతన వాహనాల వినియోగానికి వార్షిక బడ్జెట్లో ఆమోదం తెలిపారు. 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలను తుక్కు కింద మార్చే పథకం తీసుకొచ్చారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు ఉంటుంది. ఆ కాలం పూర్తయ్యాక మళ్లీ ఫిట్ నెస్ టెస్ట్ చేయించాలి. అదే కమర్షియల్ వాహనాలు అయితే, 15 ఏళ్ల తర్వాత కచ్చితంగా ఫిట్ నెస్ టెస్ట్ చేయించాలి.
కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం న్యూస్18 తెలుగును ఫాలో అవ్వండి.